నర్సంపేట టౌన్,నేటిధాత్రి :
నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట – 4 అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి కేంద్రం అలాగే పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు రవీందర్, వెంకటేశ్వర్లు,అంగన్వాడీ టీచర్స్ నల్ల భారతి, ఎండీ గౌసియా, ఆయా సునీత,మౌనిక, అనిత, పద్మ,విద్యార్థులు పాల్గొన్నారు.