పాలమూరు ఎంపీ డీకే అరుణ..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని నవబుపేట మండల కేంద్రం నుండి తిరుమలపూర్ గేట్ వరకు పాలమూరు ఎంపీ డీకే. అరుణ బీటీ రోడ్డుకొరకు శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ సభ్యురాలు డీకే. అరుణమ్మ కి నవాబుపేట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు కమ్మరి లక్ష్మీ శాలువాగప్పి ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆర్.బాలత్రిపుర సుందరి,బీజేవైఎం నవాబుపేట్ మండల అధ్యక్షులు బుడ్డోళ్లు ఆంజనేయులు, బిజెపి మండల అధ్యక్షులు గవిడ్ల రాజు, జీఎస్.రామకృష్ణ, జిల్లా మెంబర్స్ పసుపుల యాదన్న, లక్ష్మీనారాయణ, బిజెపి నాయకులు డాక్టర్ శివాజీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.