మహాదేవపూర్- నేటి ధాత్రి:
అంతిమ క్రియలకు వెళ్లి స్నానం ఆచరిస్తూ చెరువులో పడి మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు చోటుచేసుకుంది. మండలంలోని అంబటిపల్లి గ్రామానికి చెందిన బింగి శేఖర్ 28, అదే గ్రామానికి చెందిన కోమరి ఐలయ్య, మృతి చెందడంతో దహన సంస్కారాలకు వెళ్లి, అంబడుపల్లి చెరువులో స్నానాలు ఆచరిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు శేఖర్ చెరువులో పడ్డాడు, అక్కడే ఉన్న మరికొందరు చూసి శేఖర్ ను ఒడ్డుకు చేర్చారు, కానీ అప్పటికి శేఖర్ మృతి చెందడం జరిగింది. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదు చేసుకున్నారు