గ్రామంలో తీవ్ర విషాదఛాయలు.. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలింపు
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని గసికంటి అజయ్ అనే యువకుడు ఆదివారం రాత్రి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అజయ్ మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. ఘటన స్థలానికి చేరుకున్న చందుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతుడు అజయ్ చనిపోవుటకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు…