Financial Aid for Newly Married Couple
నూతన వధూవరులను ఆశీర్వదించి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలంలోని పోతారం గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఉప్పు ప్రమీల రాజేశం ల కూతురు వివాహానికి మాజీ జెడ్పిటిసి సభ్యులు నాగినేని జగన్మోహన్ రావు రూ.5000 ల ఆర్థిక సహాయం అందజేశారు.ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి సహాయం చేయడం విశేషం.ఈ సందర్భంగా నాగినేని జగన్మోహన్ రావు మాట్లాడుతూ సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ముఖ్యంగా చదువుకునే పిల్లలకు అండగా నిలవాలని,వారి భవిష్యత్తు కోసం మన వంతు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.బాలిక కుటుంబ సభ్యులు,పోతారం గ్రామస్తులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతారం గ్రామ శాఖ అధ్యక్షులు నర్ర మల్లయ్య,వార్డు సభ్యులు చింతల అనిల్ కుమార్,ఇట్టం రమేష్,మాజీ ఎంపీటీసీ సభ్యులు బండ సమ్మయ్య,నెత్తెట్ల భారతలక్మి–కొమురయ్య,స్థానిక కాంగ్రెస్ నాయకులు చెల్కల జితేందర్,డా.చారి,చెల్కల ఓదెలు,ఇట్టం వెంకటేష్,నెత్తెట్ల శ్రావణ్, బత్తుల మల్లేశం,ఒల్లేపు మొగిలి,ఉప్పు భూషణం,ఉప్పు మొగిలి,బత్తుల రాజేష్,తదితర కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
