వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి లో
గంజి చాటకూలి కార్మికురాలు ఎశమొని.పద్మ 33వ వార్డులో రొట్టెలు తయారు చేయుటకు షెడ్డు నిర్మించుకొని ఉపాధి పొందుతుంది. విద్యుత్తు షాక్ వల్ల షెడ్డు దగ్ధమైంది. నిరు పేదరాలైన బాధితురాలి పరిస్థితిని మాజీ కౌన్సిలర్ ఉంగ్లమ్
తిరుమల్ మాజీ ఎంపి రావుల.చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా స్పందించిన రావుల ఆమెకు 5000రూపాయల ఆర్థిక సహాయం పంపినారని మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు ఈ కార్యక్రమంలో 33 వ వార్డు ప్రజలు రేణుబాబు,కడెం.శేఖర్,దండు.శ్రీనదండు.యాది,రమేష్ యాదవ్,వజ్రాల.రమేష్ పాల్గొన్నారు.
చాటకూలి కార్మికురాలికి ఆర్థిక సహాయం పంపిన మాజీ ఎంపి రావుల
