Food Festival at Montessori School
నెక్కొండ మాంటిస్సోరి హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్
ఆహార అలవాట్లు ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన:
కరస్పాండెంట్ అంజన్ రెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలోని మాంటిస్సోరి హై స్కూల్లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, పాఠశాల ఆవరణలో వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. చిన్నారులు తమ ఇళ్ల నుంచి తెచ్చిన వంటకాలను పరస్పరం పంచుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పంచుకునే భావన, మంచి అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమ అధ్యక్షులు ప్రిన్సిపాల్ కొత్త మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ల ద్వారా విద్యార్థుల్లో సామాజిక విలువలు, సహకార భావం పెంపొందుతాయని అన్నారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న పాఠశాల కరస్పాండెంట్ తాటిపర్తి అంజన్ రెడ్డి విద్యార్థులకు పరిశుభ్రతపై దిశా నిర్దేశం చేశారు. ఆహారం తయారు చేసే ముందు, తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, శుభ్రమైన పాత్రలు ఉపయోగించాలని, ఆహారాన్ని కప్పి ఉంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను చెత్త బుట్టలో వేయాలని సూచించారు. ట్రెజరర్ డాక్టర్ ఆర్ ఆనందరావు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పుష్టికరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
