రైతు బాంధవుడు కేసీఆర్‌

https://epaper.netidhatri.com/

విజయం ఖాయమైంది మెజారిటీ కోసమే ప్రయత్నం
60 ఏళ్ల అంధకారంపై…అభివృద్ధి సూర్యుడై పొడిచిన పాలకుడు కేసీఆర్‌
ఎడారిగా మారిన తెలంగాణను సిరుల తెలంగాణ గా మార్చిన అధిపతి..రైతు సంక్షేమ వారధి.
రైతు రాజ్యాన…కేసిఆర్‌ నజరాన!

`రైతు వరదాత కేసిఆర్‌…

`రుణ విముక్తి జరిగింది.

` రైతు బాంధువుడు…అపర భగీరధుడు.

స్వతంత్ర భారతాన రైతు కన్నీరు తుడిచిన ఏకైక నాయకుడు ‘‘కేసిఆర్‌’’ అని అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ’’నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న అంశాలు…ఆయన మాటల్లోనే.
`తెలంగాణ రైతులందరి పక్షాన కృతజ్ఞతలు.

`కేసిఆర్‌ మాటంటే మాటే…

`ఎంత కష్టమైనా నెరవేర్చుడే!

`రైతంటే ఎనలేని ప్రేమ వుండేది ఒక్క కేసిఆర్‌ కే!

` రైతు దిగులు తీరె…

`రైతు ఇంట ఆనందమే.

` రంది తీరిన రైతుకు సంబరమే.

`సంక్షేమ తెలంగాణ… పురోగతి గ్రామ, గ్రామాన.

` 31 లక్షల మంది రైతులకు లబ్ధి.

` 19 వేల కోట్ల సర్థుబాటు.

`అనూహ్యమైన నిర్ణయం.

` తెలంగాణ రైతుకు వరాల మూటలు.

` గత పదేళ్లలో రైతు కోసం ఊహకందని పథకాలు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

రైతు మనసు తెలిసిన నాయకుడు పాలకుడౌతే ఆ రాష్ట్రం ఎంత సుభిక్షంగా, ఎంత సుసంపన్నంగా వుంటుందో తెలంగాణను చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది. ఎందుకంటే కేసిఆర్‌ స్వతహాగా రైతు. ఆయనకు రైతు కష్టాలు తెలుసు. రైతు కన్నీళ్లు తెలుసు. సాగు కోసం ఎంత రైతు కష్టడతాడో తెలుసు. ఆరు గాలం శ్రమించినా, ఫలితం దక్కని నాడు రైతు వేదన ఏమిటో తెలుసు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కన్నీళ్లు కార్చే రోజులు ఎలా వుంటాయో తెలుసు. బంగారు పంటలు పండిద్దామనుకుంటే నీళ్లు లేకపోతే ఎంత కన్నీటి పర్యంతమౌతాడో తెలుసు. సాగు చేసేందుకు రొక్కం లేక ఎన్ని అవస్ధలు పడతాడో తెలుసు. అందుకే తెలంగాణ వస్తే గాని రైతు దుఖం తీరదని నిర్ణయం తీసుకున్న గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. పట్టుదలకు మారు పేరుగా ఆయన పట్టిన పట్టు విడవలేవు. తెలంగాణ సాధించేదాకా విశ్రమించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి. ఆయనకు రైతులంటే వల్లమాలిన ప్రేమ. గౌరవం. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని జలయజ్ఞం చేసిన గొప్ప మహర్షి కేసిఆర్‌. ఆయనను వేనోళ్ల పొగిడినా సరిపోదు. దేశమంతా ఆయన పేరు నినాదమైనా సరిపోదు. అంత గొప్ప గుణం వున్న నాయకుడు దేశంలోనే మరొకరు లేదు. కేవలం రైతు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్‌. పరిస్ధితులు అనుకూలించినప్పుడు ఎవరైనా పనులు చేస్తారు. కాని ప్రజల కోసం ఎంతటి ఇబ్బందులైనా ఎదుర్కొని పనులు పూర్తి చేయడం అన్నది ఎంతో గొప్పది. అందుకోసం కొన్ని దశాబ్ధాలుగా శ్రమ పడడడం అన్నది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం ఒక్క కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. నీటికెడ్చిన తెలంగాణ గోసను చూసి దుఖం తన్నుకొచ్చిన రోజులు చూసిన నాడు నా తెలంగాణ అంటూ కంటి తడిపెట్టుకున్నది కేసిఆర్‌. అసలే అరకొర వ్యవసాయం అనుకుంటే విద్యుత్‌ చార్జీల మోతతో తెలంగాణను ఎడారిగా మార్చే ఉమ్మడి పాలకుల కుట్రను ఎదుర్కొన్నది కేసిఆర్‌. అందుకే తెగించి 2001లో తెలంగాణ కోసం బయలు దేరి తెలంగాణ సాధించేవరకు అలుపెరగని పోరాటంచేశాడు. మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. ఎత్తిన పడికిలి దించలేదు. ఇప్పుడు పాలకుడిగాకూడా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలోనే తీసుకున్న నిర్ణయాలను వరసగా అమలు చేస్తున్నాడు. రైతు లోకం తెలంగాణలో సృష్టిస్తున్నాడు. ఒకనాడు ఎక్కడ చూసినా నెర్రెలు పారి, పడావు పడ్డ భూములు. మరి నేడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు. పండుతున్న బంగారు పంటలు. పదేళ్లలో ఎంత అధ్భుతం. ఎంత ఆశ్చర్యం. ఇలాంటి తెలంగాణ ఆవిష్కణ ఇంత తక్కువ సమయంలో జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రగతి పరుగులు ఎవరూ కలగనలేదు. కాని కేసిఆర్‌ మాత్రమే కలగన్నాడు. ఆ కలను నిజం చేసి చూపిస్తున్నాడు. అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , నేటిదాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వెలుబుచ్చిన విషయాలు. ఆయన మాటల్లోనే…
ఎన్నికల సమయంలో రైతు రుణ మాఫీ గురించి ప్రజలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిలబెట్టుకున్నారు.
తెలంగాణలో రైతు, సాగు గురించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారని మరోసారి నిరూపించారు. రైతు రుణమాఫీ మూలంగా తెలంగాణలోని సుమారు 31లక్షల మంది రైతులకు ఊరట కల్గుతుంది. అందుకోసం అవసరమైన రూ.19వేల కోట్ల రూపాయాలు సర్ధుబాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజునుంచే రుణమాఫీ అమలు చేస్తున్నారు. రైతు రుణ మాఫీ ఎప్పుడో జరిగిపోయేది. కాని మధ్యలో కరోనా కాలంలో రెండేళ్లపాటు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రైతు బంధు ఆగలేదు. ప్రాజెక్టుల పనులు నిలిచిపోలేదు. అందుకే కొంత కాలయాపన జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా, ఎవరూ ఊహించని అనేక పనులు, పధకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ తలరాతనే మర్చేశాడు. తెలంగాణను బంగారు నేలగా తీర్చిదిద్దారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వస్తుందని ఎవరూ ఊహించలేదు. దానితో ముడిపడినటువంటి అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందని అనుకోలేదు. తెలంగాణ నిండు కుండలా కరువులొచ్చినా సాగుకు కష్టం రాకుండా నీటి నిల్వలతో కళకళలాడుతుందని కలగనలేదు. చెరువు బాగు గురించి ఎవరికీ అవగాహన కూడా లేదు. కాని అవన్నీ నెరవేరాయి. తెలంగాణలోని సుమారు 46వేల చెరువులు పూర్వకళను సంతరించుకున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఎండిపోయిన చెరువులు మళ్లీ పురుడు పోసుకున్నాయి. నేనున్నానని గుర్తు చేస్తున్నాయి. చెరువే ఊరికి ఆదరువు అని పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. తెలంగాణ పల్లెలో పొలాలకు నీళ్లందిస్తున్నాయి. కుల వృత్తులకు ఆధారంగా నిలుస్తున్నాయి. చెరువులే మత్య్స సంపదకు ఆలవాలంగా మారిపోయాయి. తెలంగాణలో నీలి విప్లవానికి కూడా శ్రీకారం జరిగింది. రైతు బంధుతో రైతుకు భరోసా కలుగుతోంది. పండిన పంటలు పొలం గట్టునే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణ రైతు కాలు మీద కాలేసుకొని పాగు చేసుకునే పరిస్ధితి వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు ఎకరం భూమి వున్న రైతు జీవితానికి ఢోకా లేదు. ఐదెకరాల రైతు నేడు కోటిశ్వరుడౌతానని కలలో కూడా కలగనలేదు. అలా తెలంగాణ తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు రైతుల పక్షాన వేల వేల ధన్యవాదాలు.
నిన్నటి నా తెలంగాణ గుర్తుచేసుకుంటే కలలో గగుర్భాటు పడుతుంది.
దేశమంతా పచ్చగా తెలంగాణ మాత్రం ఎందుకు ఇలా ఎండిపోతోందని అనుకునేవాళ్లం. మధన పడేవాళ్లం. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరుకు అనంతపురం లాంటి జిల్లాలో పంటలు పండుతున్న తరుణంలో తెలంగాణలో ఎందుకు పంటలెందుకు లేదు? కనీసం తాగడానికి మంచినీళ్లు ఎందుకు లేవు? అరవై తెలంగాణ గోస పడిరది. నీటి చుక్కకు తండ్లాడిరది. గొంత తడవక తల్లడిల్లింది. సాగు లేక భూమి తల్లి విలవిలలాడిరది. రైతు బతుకు చిద్రమైంది. వానలు పడితే సాగు. అది కూడా ఆకాశం వైపు నిత్యం చూసుకుంటూ కన్నీళ్లతో సాలు తడిపిన కాలం. తొలకరిని చూసి మురిసిపోయి చేసుకునేసాగు. ఆ తర్వాత చినుకు జాడ లేకపోతే ఎండిపోతున్న సాలును కన్నీరొలికే సాగు. నీరు లేక వేసిన విత్తనం పురుగు తింటుంటే మోడు వారిని బతుకు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు కష్టం పగవాడికి కూడా రాకూడదనంత దుర్భరంగా వుండేది. ప్రజలకు తినడానికి తిండి లేక, చేయడానికి పనులు లేక, దేశాలు పట్టిపోయిన కాలం గుర్తు చేసుకుంటే తెలంగాణను సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ యుగపురుషుడుగానే చూడాలి. తెలంగాణ సాగును చూసి ఆయన పాలన స్వర్ణయుగంగా చెప్పుకోవాలి. గతంలో రాజుల కాలంలో గుప్తు కాలం స్వర్ణయుగమని చదువున్నాం. అదెలా వుంటుందో ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో చూస్తున్నాం. బంగారు తెలంగాణలో చూసి తరిస్తున్నాం. మురుస్తున్నాం. రైతు రాజుగా చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తుంటే ఇది నా తెలంగాణ అని సంబరపడుతున్నాం. నా తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను రైతులోకం కొలుస్తోంది. కేసిఆర్‌ నామస్మరణ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *