Headlines

మీరు మీటర్లు పెట్టలే…మేం నిధులియ్యలే!

https://epaper.netidhatri.com/

`ఇంతకాలం కేసిఆర్‌ చెబుతున్నదే నిజమైంది.

`నిర్మలా సీతారామన్‌ మాటలతో తేటతెల్లమైంది.

` రైతులపై కేంద్రం కపట నాటకం బయటపడిరది.

` కేంద్ర ఆర్థిక మంత్రే స్వయంగా చెప్పేసింది.

`మీటర్లు పెడితేనే రుణాలన్నది నిజమే…అని ఒప్పుకున్నది.

`మీటర్లు పెట్డమని తెగేసి చెప్పిన కేసిఆర్‌.

`అప్పులు ఆపిన నరేంద్ర మోడీ సర్కార్‌.

`దేశమంతా మీటర్లు పెట్టింది కనిపించడం లేదా?

`తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా?

` నిర్మలా సీతారామన్‌ తెలంగాణపై అక్కసు వ్యాఖ్యలు.

`బిజేపి కథ ఇట్లుంటే కాంగ్రెస్‌ కథ మూడు గంటలు.

`కర్ణాటకలో ఐదు గంటలిస్తున్నాం…తెలంగాణ లో మూడు గంటలు చాలంటరు.

`డిల్లీ పార్టీలను నమ్మితే నిండా ముంచుతరు.

`తెలంగాణ ను గోస పెడతరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

బిజేపి డొల్లతనమంతా తేటతెల్లమైంది. బిజేపి నేతలు మాటల గారడి బైటపడిరది. ఇంత కాలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిందే నిజమైంది. ప్రజలను మభ్యపెట్టాలని చూసిన రాష్ట్ర బిజేపి నేతల బండారం బైటపడిరది. వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెడితేనే రుణాలిస్తామని తెగేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వ మోసం ఎట్టకేలకు బైటపడిరది. ఇక ఇదిలా వుంటే దొంగే దొంగ అన్నట్లు కరీంనగర్‌లో బిజేపి అభ్యర్ధి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. కరీంనగర్‌ ప్రచారంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ మళ్లీ కేసిఆర్‌ వస్తే వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతుడు అన్నాడు. ఇంతకన్నా నీతి మాలిన ప్రచారం ఎక్కడైనా వుంటుందా? ఓ వైపు సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మేం చెప్పినట్లు కేసిఆర్‌ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని చెబుతున్నారు. అందుకే మేం డబ్బులు ఇవ్వలేదని కూడా తేల్చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు రైతులకు ఉచిత కరంటు ఇస్తే ఎలా? సంస్కరణలు ఎలా అమలు జరగాలి? అంటూ నిర్మలా సీతారామన్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ప్రశ్నించింది. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం సాగు మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే రుణాలు ఇవ్వలేదని కూడా తేల్చిచెప్పారు. రైతుల బోర్లుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిన వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా? ఎందుకు మీటర్లు పెట్టలేదని నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. కాని బండి సంజయ్‌ ఎప్పటిలాగే అబద్దాలను నమ్ముకున్నాడు. అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. మళ్లీ బిఆర్‌ఎస్‌ వస్తే రైతులు నష్టపోతారని అనడం అంత దుర్మార్గం ఏమైనా వుంటుందా? కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టమని తేగేసి చెప్పడాన్ని కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే ఏటా ఇవ్వాల్సిన రుణాలు కేంద్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేక సందార్భలలో చెబుతూనే వున్నారు. కేసిఆర్‌ బతికుండగా రైతులకు నష్టం జరగనివ్వని చెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అది కేంద్రానికి నచ్చలేదు. అలాంటి బిజేపి రైతులకు మేలు చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? గతంలో నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఒత్తిడిపై ప్రకటన చేశారు. అది ఎంత మాత్రం నిజం కాదని ఎమ్మెల్యే రఘునందన్‌, ఎంపి. అరవింద్‌ చెప్పారు. ఇప్పుడు వాళ్లు తెలంగాణ రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాల్సిన అవసరం వుంది. ఇంత జరుగుతున్నా బిజేపి నేతలు తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేయాలనే చూస్తున్నారు. తెలంగాణ ప్రజల మీద ఎలాంటి ప్రేమ రాష్ట్ర నేతలకు కూడా లేదని తేలిపోయింది. పొరపాటున బిజేపికి ఓటు పడితే, రైతులు మోటార్లు పెట్టుకోవడానికి సిద్దమని ఒప్పుకున్నట్లే అని కూడా బిజేపి ప్రచారానికి వెనుకాడదు. సరిగ్గా ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టడం లేదని చెప్పినా, బిజేపికీ ఓట్లు వేశారంటే రైతులు మా పక్షానే వున్నారని, మోటార్లు పెట్టాలని కూడ కోరుతారు.
కేవలం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు ఏర్పాటు చేయలేదన్న కోపంతో కేంద్ర ప్రభుత్వం రూ.35వేల కోట్లు ఆపడం జరిగినట్లు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు వెల్లడిరచారు.
అంటే తెలంగాణ మీద బిజేపికి ఎంత కక్ష వుందో అర్దం చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. అరవైఏళ్లు రైతులు గోసపడిన ప్రాంతం. వలసలు పోయి, కుటుంబాలు ఆగమైన ప్రాంతం. చుక్క నీరు లేక ఎండిపోయిన ప్రాంతం ఇప్పుడిప్పుడో కోలుకుంటోంది. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ కృషి చేస్తుంటే, కేంద్రం సహకరించాల్సిందిపోయి, మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు రైతులను బిజేపి గోస పెట్టాలని చూడడం భావ్యమా? కేంద్రం ఇచ్చే రూ.35వేల కోట్లకన్నా, మాకు 68లక్షల తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీటర్లు పెట్టలేదు. అదే పొరుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. తమిళనాడులో, కార్నాకట, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌లలో కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే రైతుల కోసం మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌. కేంద్రం ఒత్తిడిని కూడా లెక్క చేయలేదు. కేంద్రం రుణాలు ఆపేసినా పరవాలేదనుకున్నాడు. తమకు తెలంగాణ రైతులు ప్రయోజనాలే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌.
ఇదిలా వుంటే కాంగ్రెస్‌ కధ మరోలా వుంది.
ఓవైపు తెలంగాణవచ్చిన నాటినుంచి రైతులకు పూర్తి ఉచితంగా నాణ్యమైన 24గంటల కరంటు ఇస్తున్నారు. ఈ సంగతి పొరుగును వున్న కర్నాటక కాంగ్రెస్‌ నాయకులకు తెలియదు. ఎన్నికల ప్రచారం అని ఎగేసుకుంటూ వచ్చి, తెలంగాణలో అధికారంలోకి వస్తే తాము రైతులకు ఐదు గంటల కరంటు ఇస్తామని ప్రకటించగానే రైతాంగం కాంగ్రెస్‌ మీద భగ్గుమన్నది. కర్నాకటలో రైతులకు ఏడు గంటలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాని కరువు మూలంగా ఐదు గంటలే ఇస్తున్నాం. ఇక్కడ కూడా అలాగే ఐదుగంటలు ఇస్తామని చెప్పి,కాంగ్రెస్‌ తన పరువును తాను తీసుకున్నది. మరో వైపు రైతులు 10హెచ్‌పి మోటార్లు ఏర్పాటు చేసుకుంటే మూడు గంటల కరంటు చాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నాడు. రైతులకు 24గంటల కరంటు అవసరం లేదని బాష్యం చెబుతున్నాడు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో , మేమూ 24 గంటలు ఇస్తామంటూ కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్లుగా 24 గంటల కరంటు చూస్తూనే, రైతులకు మూడు గంటలు కరంటు చాలనే కాంగ్రెస్‌ను ప్రజలు నమ్ముతారా? వారిని ఆదరిస్తారా? కాంగ్రెస్‌, బిజేపిలు రైతుల పట్ల ఎంత చిత్తశుద్దితో వున్నారో తేలిపోయింది. ఆ పార్టీల నిజస్వరూపం తెలిసిపోయింది. రైతుల గురించి ఆలోచించేది కేవలం బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అన్నది రుజువైంది. రైతులకు అహర్నిషలు మేలు చేసేది కేవలం కేసిఆర్‌ మాత్రమే అన్నది రైతులకు కూడా పూర్తిగా అవగతమైంది.
దేశమంతా విద్యుత్‌ సంస్కరణలు తెచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో కూడా రైతుల వద్ద విద్యుత్‌ ఫీజులు వసూలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.
అయితే తెలంగాణ ఆ పనికి గండికొట్టింది. దాంతో కేంద్రం అప్పులు ఇవ్వడం లేదు. పైగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని బిజేపి పెద్దలు ఆరోపిస్తున్నారు. దేశంలో వున్న 28 రాష్ట్రాలలో తెలంగాణ అప్పులు కింది నుంచి ఆరో రాష్ట్రంగా మాత్రమే వుంది. కాని బిజేపి మసిబూసి మారేడు కాయ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేసే అప్పులలో సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు ఉచిత విద్యుత్‌, రైతు బంధు వంటి పధకాలు, ఇతర అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తోంది. కాని కేంద్రం పేద ప్రజలకు సేవ చేయాల్సిన అవసరాన్ని వదిలేసి, వ్యాపారులకు పదిలక్షల కోట్ల అప్పులు మాఫీ చేయడం గమనార్హం. ఆ పది లక్షల కోట్లతో దేశంలోని పేదలందరి జీవితాలు మారిపోయేవి. వారికి మౌలిక సదుపాయల కల్పన మరింత జరిగిదే. దేశంలో అందరికీ ఇండ్లు వచ్చేవి. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యులు కూడా లక్షాధికారులయ్యేవారు. రైతులకు మేలు చేస్తే మరింత పంటల దిగుబుడుల పెరిగేవి. మన వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు కూడా చేరేవి. కాని కేంద్రం ఆ పని చేయలేదు. పేరు మోసిన వ్యాపారులకు వారి అప్పులు మాఫీ చేసింది. దేశానికి అన్నం పెట్టే రైతున్నల నుంబి బిల్లులు వసూలు చేయాలనుకుంటోంది. ఇదీ కేంద్ర ప్రభుత్వానికి, బిజేపి పెద్దలకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తేడా…కేసిఆర్‌ పేదల పక్షపాతి. రైతుల సంక్షేమ వాది. రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడు, పాలకుడు. మరి బిజేపి… వాళ్లే సమాదానం చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *