మంగ్లీ చుట్టూ అల్లుకున్న అబద్దాలు!

`ఆమె పాట చుట్టూ కమ్ముతున్న మబ్బులు!

`మంగ్లీ పై ఎగిసి పడుతున్న విష కీలలు!

`పగ వాళ్ళు పేనుతున్న అగ్ని వలయాలు.

`మంగ్లీ పాటను పాతర పెట్టాలనుకుంటున్నారు.

 

`మంగ్లీ కీర్తిని కరిగించాలనుకుంటున్నారు.

`మంగ్లీ చుట్టూ విష గాలి జాతర చూడాలనుకుంటున్నారు.

`కట్టు కథలకు పుట్టుకొచ్చే విషనాగులుంటాయి.

`సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతున్నాయి.

`పాటను బతికిస్తున్న మంగ్లీ గొంతు నొక్కాలని చూస్తున్నాయి.

`పాటల పూతోటను ఆగం చేయాలనుకుంటున్నాయి.

`కుళ్ళకుంటున్న వేల కళ్ళు కాచుకొని కూర్చున్నాయి.

`అవకాశాలన్నీ మంగ్లీ వైపు వెళ్ళడాన్ని భరించలేక పోతున్నాయి.

`మంగ్లీ పాడిన ప్రతి పాట ప్రపంచాన్ని తాకుతోంది.

`ఆట, పాట, అభినయం అన్నీ గానంలో ఓలలాడుతున్నాయి.

`సరస్వతి నాదాలు మంగ్లీ నాలుక మీద తాండవం చేస్తున్నాయి.

`మంగ్లీని ఎంత తొక్కాలనుకున్న సాధ్యం కావడం లేదు.

`ఎల్లలు లేకుండా ఎదుగుతున్న మంగ్లీని ఆపతరం కావడం లేదు.

`జాతీయ స్థాయికి మంగ్లీ గొంతు పాకింది.

`మంగ్లీ పాటల పరవశంలో దేశమే కరిగిపోతోంది.

`భరించలేని వాళ్ళు కత్తి కట్టారు. మంగ్లీ పాటను ఖతం చేయాలనుకుంటున్నారు.

`ఓర్వలేని తనం పెంచుకొని తోడేళ్ళలా తరుముతున్నారు

`పాటలమ్మపై పగ పెంచుకున్నారు.

`మంగ్లీ పాట మూగబోవాలని చూస్తున్నారు.

`ప్రతి అడుగు మీద విషం కక్కుతున్నారు.

`పుట్టినరోజు జరుపుకున్నా ఓర్వలేక పోతున్నారు.

హైదరాబాద్, నేటిధాత్రి:

నిజం గడప దాటేలోగా అబద్దం ఊరు చుట్టి వస్తుందంటే ఇదే మరి. ఈ రోజుల్లో నిజా నిజాలు ఎవరికీ అక్కర్లేదు. అబద్దమేమిటో, నిజమేమిటో తెలుసుకోవాల్సిన అసవరం కూడా కనిపించడం లేదు. ఆ సమయం లేదు. వున్నా పట్టించుకునే తీరిక లేదు. అందరూ సోషల్‌మీడియాలోనే వుంటారు. ఎల్లప్ప్పుడూ సెల్‌ఫోన్ చేతిలోనే పట్టుకుంటారు. కాని నిజాన్ని వెతుక్కోరు. అబద్దాలను అర క్షణంలో నమ్ముతుంటారు. నిజం ఎవ్వరు చెప్పినా నమ్మరు. నిజం చెబుతుంటేనే నివ్వెరపోయి చూస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో ఏ సెలబ్రిటీ గురించి ఏదైనా వార్త వస్తే చాలు. జనానికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లే..సరిగ్గా ఇప్ప్పుడు సింగర్ మంగ్లీ విషయంలో జరిగింది. జరుగుతోంది. జీడిపాకంలా కొంత మంది పనిగట్టుకొని సాగిస్తూనే వుంటారు. ఇలాంటివి గతంలో కూడా ఇతరుల విషయంలో చూసిందే. ఇలాంటి విషయాలల్లో స్వార్థపరులు చేరుతారు. అవసరం లేని వాళ్లు దూరుతారు. మంగ్లీ వారికి బాగా తెలిసినట్లుగా ఆమెపై అబాండాలు వేస్తున్నారు. స్వయంగా వాళ్లకు అన్యాయం జరిగిందనే వాళ్లు కూడా మూగుతారు. అసలు వాళ్లు మంగ్లీని ప్రత్యక్ష్యంగా ఒక్కసారి కూడా చూడని వారు సోషల్ మీడియాలో సొల్లు చెబుతుంటారు. ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పెడుతుంటారు. నోటికొచ్చిన పదాలను కామెంట్లలో వాడుతుంటారు. వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తిస్తుంటారు. ఇలా ఒకరిని చూసి ఒకరు ఇష్టాను రీతిని కామెంట్లు చేస్తుంటారు. అలా వారిని మానసికంగా ఇబ్బందులు పెడుతుంటారు. మంగ్లీ మీద కోపం వున్న వాళ్లు చేరుతారు. మంగ్లీ వల్ల అవకాశాలు మగ్యమైపోతున్నాయని భావించే వారుంటారు. ఎప్ప్పుడైన ఎవరైనా సెల్ఫీ అడిగినప్ప్పుడు సమయం లేక చూడకపోతే కూడా ఆ కోపం పెంచుకున్న వాళ్లు ఇలాంటి సమయంలో దూరుతుంటారు. ఇలా రకరకాల మనుషులు సోషల్ మీడియాలో చేసి సెలబ్రిటీల మీద చెత్తంతా పోగు చేస్తుంటారు. ఆమె ఎలాంటిదో ప్రజలు గత పదిహేనేళ్లుగా చూస్తూనే వున్నారు. పదిహేనేళ్లుగా ఆమె ఎదుగుతున్న తీరు గమనిస్తూనే వున్నారు. ఆమె కష్టపడే విధానం చూస్తున్నారు. ఒక్కొ మెట్టు ఎలా ఎదిగిందో తెలుసు. ఎలా అవాతంరాలను కూడా ఎదుర్కొంటూ పైకొచ్చిందో చూశారు. ఎన్ని అద్భుతమైన పాటలు పాడారో వింటూనే వున్నారు. ఆ పాట, ఈ పాట అనే తేడాలేదు. ఎలాంటి పాటనైనా సరే అవలీగా పాడుతుంది. పొగిడిన సమాజమే ఎప్ప్పుడు పడిపోతుందా? అని చూసే వాళ్లు కూడా వుంటారు. ఈ మధ్య కొన్ని రోజులుగా మంగ్లీ ఏం చేసినా, ఏది జరిగినా విరుచుకుపడుతున్నారు. ఆఖరుకు తన పుట్టిన రోజును జరుపుకున్నా వివాదం చేశారు. ఏడాదిక్కొసారి వచ్చే రోజును కూడా నిమ్మలం లేకుండా చేశారు. పైగా పుట్టిన రోజు వేడుక జరిగే వద్దకు పోలీసులు వచ్చారు. అక్కడేదో జరగకూడనిది జరుగుతున్నట్లు కాసేపు సినిమా చూపించారు. ఆ వీడియోలను పట్టుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాశారు. అక్కడ విదేశీ మద్యంవుందని కొందరు, ఏకంగా మత్తు పదార్దాలు దొరికినట్లు మరి కొందరు ఎవరికి తోచింది వారు రాశారు. కాని అసలు నిజం ఎవరూ రాయరు. ఎందుకంటే నిజం ఎవరికీ అక్కర్లేదు. న్యూసెన్స్ లేకుండా న్యూస్ కనిపించని రోజులివి. కంటెంట్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మీడియాతోపాటు, సోషల్ మీడియా కూడా న్యూసెన్స్ చేస్తూ, న్యూస్ క్రియేట్ చేస్తోంది. ఆ మధ్య ఓ భక్తి గీతం విషయంలో అదే జరిగింది. అసలు భక్తుడు అనే వాడు దేవుడిని కొలుస్తున్న వేళ కోపం కూడా ప్రదిర్శించే సన్నివేశాలు చరిత్రలో అనేకం వున్నాయి. అలాంటి పాటలు కూడా వున్నాయి. అప్ప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. వాటిని నోరారా పాడుకున్న వారు వున్నారు. కాని ఇప్ప్పుడు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞాన సమాజం పెరిగిపోతోంది. చరిత్ర తెలియదు. మూలం తెలియదు. అసలు అక్షరం తెలియని వాళ్లంతా మోపయ్యారు. మైకులు చేతుల్లో పట్టుకుంటున్నారు. మాటలు నేర్చుకున్నారు. సోషల్ మీడియా అంటున్నారు. సింగర్ మంగ్లీ పాడిన భక్తి పాటలో అమ్మవారిని తిట్టిన శబ్దాలున్నాయని కొంత కాలం రచ్చ రచ్చ చేశారు. ఈ మధ్య ఓ హిందీ సినిమా పాటపై కూడా అదే చేశారు. సమాజంలో మంచి పాటలు, చెడ్డ పాటలు అనేవి వుంటాయనుకోవడం జనం భ్రమ. సూటిగా చెప్పితే అది బూతులా వినిపిస్తుంది. సంస్కత పదాలు జోడిస్తే అదేదో గొప్పగా అనిపిస్తుంది. ఏ పాటలో బూతు లేదు. ప్రతి పాట బూతమయమే …కాదని చెప్పడానికి ఏ పాట భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అది సామాన్యులకు అర్ధం కాదు. కాని ఇటీవల తమకు తెలిసిందే నీతి..లేకుంటే సోది అనుకునేవారు ఎక్కువయ్యారు. సెలబ్రిటీలపై నిందలు వేస్తున్నారు. వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఒక రంగంలో పైకి రావాలనుకుంటే కష్టంతో పాటు ఆవ గింజంత అదష్టం కూడా వుండాలి. ఆ విషయం తెలియని వాళ్లు అతి తెలివి ప్రదర్శిస్తుంటారు. మంగ్లీ మాకన్నా బాగా పాడుతుందా? అని తోటి గాయనీమనులు కూడా వున్నారు. ఇలా అందరి కళ్లూ ఆమెపైనే వున్నాయి. ఆమె పాటలమ్మగా వెలగడం కన్నా కూలిపోవాలని చూసే వారు ఆమె రాణిస్తున్న రంగంలో అనేక మంది వుంటారు. సహజంగా సెలబ్రిటీలుగా ఒక్కసారి సమాజం నుంచి గుర్తింపు వచ్చే వారి చుట్టూ ఎందరో చేరుతుంటారు. అలా చేరిన వారు ఎవరో కూడా ఆ సెలబ్రెటిలకు తెలియదు. ఆ సెలబ్రిటీల పక్కనే తిరుగుతూ వుంటారు. అలా వీడియోల్లో ఫోటోల్లో కనిపిస్తుంటారు. వాళ్లు అలా సెలబ్రిటీల పేర్తు చెప్ప్పుకుంటారు. ఇప్ప్పుడేమిటి నలభై ఏళ్ల క్రితమే శివ సినిమాలోనే ఇలాంటి వారి గురించి రామ్‌గోపాల్ వర్మ చూపించారు. ఓ పాతిక సంవత్సరాల క్రితం కష్ణవంశీ కూడా ఖడ్గం సినిమాలో చూపించారు. సెలబ్రిటీలు తెలుసని చెప్ప్పుకొని అవకాశాలిప్పిస్తామని చెప్ప్పుకుంటారు. ఇలా మంగ్లీ విషయంలో జరిగినట్లు ఏవో వసూళ్ల పర్వాలు సాగిస్తుంటారు. ఇప్పటికీ ఫోటోలు, వీడియోలు చూపిస్తే నమ్మే అమాయక జనాలు వున్నంత వరకు సెలబ్రిటీల పేరు చెప్పి మోసం చేసే వారు వుంటూనే వుంటారు. ఎక్కడో మైక్రో ఫైనాన్స్ పేరిట డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్న వారి మాటలకు, మంగ్లీకి ఏం సంబంధం. ఏదో పబ్ నిర్మాణం చేస్తునట్లు, ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నట్లు ఎవరో చెప్పి, నమ్మిస్తే అందుకు మంగ్లీ ఎలా బాధ్యురాలౌతారు. ఇప్పటికీ పాటకు పది వేలు కూడా సరిగ్గా ఇవ్వకుండా పాటలు పాడించుకుంటున్నా, పాట బతకాలని పాటలు పాడుతుంటారు సింగర్లు. తమ గొంతు ప్రజల్లో వుంటే చాలనుకుంటారు. ఇచ్చింది తీసుకుంటారు. అలా త్యాగాలు చేస్తూ, ప్రజలను రంజింపజేయడమే జీవితాశయంగా బతుకుతున్న వాళ్లలో మంగ్లీ లాంటి వారు ఒకరు. అలాంటి మంగ్లీ నిజంగా డబ్బులు సంపాదించకోవాలనుకుంటే అనేక వ్యాపారాలు ఆమె స్వయంగా పెట్టుకోవచ్చు. ఆసుపత్రి లాంటి నిర్మాణం చేపడితే ఆమె ప్రజలను నేరుగా కోరుకునే అవకాశం వుంటుంది. అంతే కాని ఎవరో తన పేరు చెప్పి వసూలు చేస్తే తమపేరు బద్‌నాం అవుతుందన్న సంగతి తెలియనంత అమాయకురాలు కాదు. ఒక్కొఇటుక పేర్చుకుంటూ తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అలాంటి మంగ్లీ తాను పేర్చుకున్న కీర్తిని చెడగొట్టుకోవాలనుకుంటారా? నమ్మించి మోసం చేయాలనుకుంటారా? ఒక వేళ ఆ పని చేయాలనుకుంటే ఇ ంత కాలం అవసరంలేదు. పైకి పాటలు పాడుతున్నా, సెలబ్రెటీలుగా చెలామణి అవుతున్నా వారి జీవితాల్లో వుంటే కష్టాలు అనేకం వుంటాయి. ఆఖరుకు తిండి కూడా లేని రోజులు వుంటాయి. అలాంటి రోజులను కళాకారులు చూసి, కడుపు మాడ్చుకొని జీవితాýను గడిపిన వారుంటారు. ఎన్ని పాటలు పాడినా ఇప్పటికీ కడుపు నిండా తినలేని వాళ్లు కూడా వున్నారు. అలా జీవితాల్లో కష్టం, నష్టం చూసి వచ్చిన వారి జీవితాలు వెలుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్లు వారి చుట్టే వుంటారు. వారికి తెలియకుండా ఏదైనా చేసేవారు వుంటారు.. వారికి కావాలని అన్యాయం చేసే వారు కూడా వుంటారు. మంగ్లీ విషయంలో కావాలనే కుట్ర జరగుతోందనేది మనకు కనిపిస్తున్న అంశం. ఆమెను ఎలాగైనా తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే ఇదంతా జరుగుతునట్లు కనిపిస్తోంది. అయినా మంగ్లీ ఏదైనా తప్ప్పు చేస్తే అందుకు చట్టం వుంది. తీర్పు చెప్పే న్యాయ స్ధానం వుంది. జనమే చట్టమైనట్లు, న్యాయం గురించి సోషల్‌మీడియాలో తీర్పులు చెప్పే తిరిక లేని వాళ్లు చాలా మంది తయారయ్యారు. ఏది ఏమైనా మంగ్లీ లాంటి పాటలమ్మను కాపాడుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి అవసరం

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version