Summer Water Booths Arranged
వేసవికాలం దృష్ట్యా చలివేంద్రాల ఏర్పాటు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
వేసవికాలం దృష్ట్యా క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం,రాజీవ్ చౌక్, సూపర్ బజార్, ఏ జోన్ రామాలయం, రైల్వే స్టేషన్, అమ్మగార్డెన్ ఏరియాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీటినీ అందించే చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మునిసిపాలిటీ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి, వైస్ ఛైర్పర్సన్ మిట్టపల్లి సరిత, మునిసిపాలిటీ కమిషనర్ మారుతి ప్రసాద్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విపరీతమైన ఎండలు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు, బాటసారులు, ప్రయాణికులు వారి దాహార్తిని తీర్చుకునేందుకు మున్సిపల్ పాలకవర్గము ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చలివేంద్రాలను ప్రజలంతా వినియోగించుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ మేనేజర్ సతీష్, ఏఈ ఆశ్రిత్, సంబంధిత వార్డు అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
