భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర టీయూడబ్ల్యూజే ఐజేయు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో టి యు డబ్ల్యూ జె ఐజెయూ రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు విరహత్ అలీ , రామ్ నారాయణ లు కలిసి తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల హెల్త్ కమిటీ సభ్యులుగా సామల శ్రీనివాస్ ను ఎన్నుకున్నట్లు భూపాలపల్లి టియు డబ్ల్యూ జే ఐజేయు జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ లు తెలిపారు .
గతంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా సేవలందిస్తున్నందుకు గుర్తించి రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న యూనియన్ టియుడబ్ల్యూజే ఐజేయూ యూనియన్ .తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల హెల్త్ సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారికి సేవలు చేసే విధంగా ఈ యొక్క హెల్త్ కమిటీ పనిచేస్తుందని అధ్యక్ష కార్యదర్శులు విరహత్ అలీ,రామ్ నారాయణ అన్నారు.
నా ఎన్నిక సహకరించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శుల క్యాతం సతీష్ కుమార్ శామంతుల శ్యామ్ కుమార్ కు భూపాలపల్లి జిల్లా శాఖకు సామల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.