Grand Cultural Fest Held as Part of Education Week
99 రోజుల కార్యక్రమములో భాగంగా నిర్వహిస్తున్న విద్య వారోత్సవాలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోపాఠశాలలో ప్రజాపాలన పగటి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో ఆరో రోజైన కళలు, హస్తకళలు సాంస్కృతిక కార్యక్రమాలు అనే అంశంపై ఘనంగా సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నుండి వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుతూ అద్భుతమైన ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాధికారి ఎం. రాజేంద్ర సిఎంఓ రమేష్ ఏఎంఓ విజయపాల్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమం అనంతరం ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రశంసాపత్రాల ప్రదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సాంస్కృతిక ఉత్సవం విద్యార్థులలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం సాంస్కృతిక విలువలను పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.
