Drug Awareness Seminar Held
మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు
చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి హాజరైనారు అనంతరం మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలను తీవ్ర సమస్యల్లోకి నెడుతూ సమాజాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ పరిధిలోని ప్రజలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను స్పష్టంగా వివరించి, బాధితుల అవగాహన కల్పించాలని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో
సోషల్ కుమార్, కళావతి, సాయిరాం, ప్రవీణ్, విజ్ఞాన్, నరేష్ తదితరులు పాల్గొన్నట్లు గుర్రం తిరుపతి తెలిపారు.
