క్రెడిట్‌ కోసం పాకులాటలా!

`వరదలపై బురద రాజకీయాలు తర్వాత చేయొచ్చు!

`రిటైనింగ్‌ వాల్‌ పేరిట రాజకీయాలా!

`వరదసాయంలో పాత్రల గురించి ప్రాపకాలా!

`నవ్విపోతురన్న సోయి లేదా!

`ముందు అందరూ సహాయక చర్యలు చేపట్టండి.

`క్రెడిట్‌ ఎవరికివ్వాలో ప్రజలు తేల్చుకుంటారు!

`గతంలో లేని, రాని వరదలు చూశారు.

`బాగుపడే పనులు మొదలు పెట్టండి!

`విజయవాడ విలవిలలాడిరది నిజమే!

`ఒక్క నగరానికే సాయం చేసి గొప్పలు చెప్పుకుంటే మానవత్వమనిపించుకోదు!

`ఇలాంటి సమయాలలో కలిసికట్టుగా పని చేయకపోతే ప్రజల్లో విలువుండదు.

`అమరావతి బాగానే వుంది.

`అమరావతి మీద అభాండాలు మానుకోండి.

`రెండు వైపుల నుంచి ప్రజలకు సాయం చేయండి!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

వరదల్లో బురద రాజకీయం చేయడం నాయకులు అలవాటే. వెన్నతో పెట్టిన విద్యే. గతంలో ఎన్నడూ లేనంతగా విజయవాడకు ఇబ్బంది కలిగింది. ఒక మోస్తారు వరదలు వచ్చిన సందర్భంలో విజయవాడలో సింగ్‌ నగర్‌ లాంటి ప్రాంతాలలోకి నీరు చేయడం సహజమే. కాని విజయవాడ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షం 166 మిల్లీమీటర్లు. అంటే 16 సెంటీ మీటర్లు. పదహారు సెంటీమీటర్ల వర్షానికే విజయవాడ అ తలాకులం కావడం అంటే పాలకుల అసలత్వం ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీనో, వైసిపినో నిందించాల్సిన అవసరం లేదు. కాని ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో వుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నీటి సామర్ధం కేవలం 3 టిఎంసిలు. అంతకు మించి నీరు చేరేందుకు అవకాశం లేదు. అయితే సహజంగా కృష్ణానదికి ఎప్పుడు వరద వచ్చినా 5 నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. కొన్ని సార్లు 7 నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. గత 120 సంవత్సరాల కాలంలో ఇప్పుడు వచ్చినంత వరద ఎప్పుడూ రాలేందంటున్నారు. 2009లో రోశయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. దాంతో నీరు విజయవాడ పట్టణాన్ని ముంచెత్తింది. తెలంగాణలో ముఖ్యంగా హైదబాద్‌లో ఒకే రోజు 34 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైన సందర్బాలు కూడా వున్నాయి. కాని 16 సెంటీమీటర్ల వర్షాపాతానికే విజయవాడ ఎందుకు మునిగిందన్నదానిపై ఇప్పటికైనా పాలకులు మేలుకొనాలి. ఇదిలా వుంటే వరద ప్రాంతాలలో తొలి రోజు జగన్‌ పర్యటించకపోతే , ప్రతిపక్ష నేత ఎక్కడా అంటూ తెలుగుదేశం పార్టీ ఆ వానలో కూడా విపరీతమైన ప్రాచారం చేసింది. జగన్‌ రంగంలోకి దిగగానే ఇదంతా జగన్‌ నిర్లక్ష్యం వల్లే జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపణలుగుప్పిస్తోంది. జగన్‌ ఎక్కడికెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. జగన్‌ వరద ప్రాంతాలన్నీంటినీ సందర్శించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ వయసులో కూడా పడల్లో ప్రయాణం చేశారు. ప్రజల వద్దకు వెళ్లారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో కూడ ఆయన ప్రకాశం బ్యారేజీ సందర్శించారు. ఇంత వరకు బాగానే వుంది.

వాతావరణ శాఖ వారం రోజుల నుంచే హెచ్చరిస్తూ వస్తోంది.

తుఫాను ప్రభావం ఎక్కువగా వుండే అవకాశం వుందని చెప్పింది. కాని అధికార యంత్రాంగం కదల్లేదు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. అయితే ఇక్కడ కృష్ణా నదిని ఆనుకొని రిటైలింగ్‌ వాల్‌ వల్ల మరింత ఉపద్రవం తప్పిందని ప్రజలే చెబుతున్నారు. ఒక వేళ రిటైలింగ్‌ వాల్‌ నిర్మాణం కాకపోతే ఇంత పెద్ద వరదకు కృష్ణ లంక దవిసీమ ఉప్పెనను మించిన నష్టాన్ని ఎదుర్కొవాల్సివచ్చేదంటున్నారు. గతంలో ఎప్పుడు కృష్ణానదికి వరదలు వచ్చినా ముందుగా లంక గ్రామల గురించి చెప్పుకునేవారు. కాని ఇప్పుడు లంక గ్రామాలు సేఫ్‌. అందుకు జగనే కారణం అంటూ వైసిపి పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నది. ప్రజలు కూడా అదే చెప్పుకుంటున్నది. దాంతో తెలుగుదేశం శ్రేణుల రంగంలోకి రిటైలింగ్‌ వాల్‌ నిర్మాణం మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడే అంటూ ప్రచారం చేసుకుంటోంది. ఇక్కడ క్రెడిట్‌ కోసం రెండు పార్టీలు పాకులాడుతున్నారు. వరదల్లో బురద రాజకీయం చేస్తున్నారు. రిటైనింగ్‌ వాల్‌ పేరుతో ఇరువైపులా రాజకీయం చేసుకుంటున్నారు. వరద సాయంలో తమ తమ పాత్రలపై ప్రాపకాల కోసం పాకులాడుతున్నారు. ప్రజలు నవ్వుతారన్న సోయి లేకుండా చేస్తున్నారు. ముందు సహాయకచర్యల్లో పాల్గొని, తేరుకున్నాక ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా ప్రజలు ఆహ్వానిస్తారు. విజయవాడ మునక వల్ల ఎదురైనసమస్యల పరిష్కారంపై క్రెడిట్‌ ఎవరికివ్వాలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఎప్పుడూ రాని వరదలు ఇప్పుడు చూశారు. ముందు భవిష్యత్తులో ఇలాంటి వరదలు వస్తే ఏం చేయాలో ఆలోచించండి. నిర్ణయాలు చేయండి. వెంటనే పనులు చేపట్టండి. నివేదికలు తెప్పించుకోండి. ఏం చేస్తే బాగుంటుందన్నదానిపై చర్చలు చేపట్టండి.

ప్రజల అభిప్రాయాలు సేకరించండి.

క్షేత్ర స్ధాయి పరిశీలనలు ఇప్పుడే చేయండి. వరద ఎలా వచ్చింది? విజయ వాడ ఎందుకు మునిగింది? గతంలో ఎన్నడూ లేనంత ఉపద్రవం ఎందుకొచ్చిందన్నదానిపై అధ్యయనం చేయండి. అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ ఇలాంటి సమయంలో ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ కూర్చుంటే ప్రజలు మెచ్చుకోరు. విజయవాడ విలవిలలాడిరది నిజమే! తుఫాను ప్రభావంతో చిగురుటాకులా వనికింది. ఒక్క విజయవాడలోనే ఇలాంటి సమస్య వస్తే కదలని యాంత్రాంగం మొత్తం రాష్ట్రానికి వస్తే పరిస్దితి ఏమిటి? ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి కట్టుగా పనిచేయాల్సిన సమయంలో కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తే సరిపోతుందా? విజయవాడలో ఇంత పెద్ద వరదలు వస్తే వైసిసి నాయకులు ఎక్కడా కనిపించడం లేదంటూ తెలుగుదేశం ప్రచారం మొదలుపెట్టింది. సహజంగా అధికార పార్టీ నుంచి సహాయ సహాకారాలు ఎక్కువగా అందించాలి. ప్రభుత్వంలో వున్న వారు ఏం సాయం చేస్తారా? అని ప్రజలు చూస్తారుగాని, ప్రతిపక్షం ఎందుకు రాలేదని ఎవరూ అడగరు. ఒక ప్రతిపక్షం ముందు వెళితే వరద రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తారు. ప్రజలకు ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు కాదు. ప్రజలకు సేవ చేయడం ముఖ్యం. దేశమంతా కరోనా కాలంలో బిక్కుబిక్కుమంటున్న సమయంలో చంద్రబాబు ఎక్కడున్నాడు? రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, హైదరాబాద్‌కే పరిమితయ్యారన్న విషయాన్ని వైసిసి గుర్తుచేస్తోంది. కరోనా కాలంలో ఏనాడైనా స్వయంగా చంద్రబాబు నాయుడు నేరుగా ప్రజలకు చేసిన సాయం ఏమైనా వుందా? అని వైసిసి లెక్కలు తీస్తోంది. ఇప్పుడున్న పరిసి ్ధతుల్లో తెలుగుదేశం పార్టీ జగన్‌ కనిపించడం లేదంటూ, వైసిసి సహాయక చర్యలకు రావడం లేదంటూ తెలుగుదేశం మాట్లాడడమే అసందర్భం. దాంతో వైసిసి గతాన్ని గుర్తిచేసి తెలుగుదేశాన్ని నిందిస్తోంది. జోగి, జోగి రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్లు, ఇప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు కాదు. ప్రభుత్వం చేసే సాయాన్ని తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంటుంది. కాని పార్టీ పరంగా నాయకులు చేస్తున్న సాయం ఏమిటో కూడా చెప్పాలి.

వైసిసి మీద నిందలేస్తే సరిపోదు.

అయినా ఇది రాజకీయాలకు సమయం కాదు. ఎన్నికలు ఇప్పుడు లేవు. మరో ఐదేళ్ల దాకా వైసిసికి అధికారం రాదు. ఇలాంటి సమయంలో ప్రజలు దూరం చేసుకున్న వైసిసిని మళ్లీ తెలుగుదేశం తన మాటలతోనే దగ్గర చేస్తుందన్న సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇక అమరావతి విషయంలో రెండు భాగాలుగా విడిపోయిన మీడియా చెబుతున్న వాటిలో వేటిని నమ్మాలో, వేటిని నమ్మకూడదో ఎవరికీ అర్ధం కావడంలేదు. అమరావతి మునిగిపోయిందని వైసిపికి చెందిన మీడియా, సోషల్‌ మీడియా విపరీతమైన ప్రచారం సాగించింది. కాని అసలు అమరావతి ఎంతో సేఫ్‌గా వుందంటూ తెలుగుదేశం మీడియా వార్తలు వండి వార్చింది. నిజానికి ఈ వరదలు ఎక్కడా అమరావతికి ఇబ్బంది కల్చించలేదు. వరదలు ఆ వైపు వెళ్లలేదు. దానిపై ఎలాంటి ప్రభావం లేదు. రోడ్డు పక్కన నీళ్లుండడాన్ని కూడా వైసిసి అమరావతి మునిగిందని ప్రచారం చేస్తే ప్రజలు కూడా స్వాగతించరు. రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో ఎలాంటి ఇబ్బంది లేదు. రోడ్ల మీద నీరు నిలిచింది లేదు. హైకోర్టు పరిసర ప్రాంతాలలో ఇంత పెద్ద వాన పడినప్పుడు నీళ్లు ఆగడం అన్నది ఎక్కడైనా పరిపాటే. కాని వైసిసి మీడియా అమరావతి ఆగమైనట్లు, అతలాకుతలమైనట్లు చేసిన ప్రచారం సరైంది కాదు. ఇక సెక్రెటేరియట్‌ ప్రాంతమంతా ఎంతో హాయిగా వుంది. ఎక్కడా నీరు నిలిచింది లేదు. సెక్రెటేరియట్‌ పరిసరాల్లో నీరు ఆగిన సందర్భం లేదు. వరదలు కనిపించింది లేదు. కాని అనవసర రాజకీయం కోసం పెట్టుబడి దారులను భయపెట్టడం వల్ల ఆ ప్రాంతానికే నష్టం. రియలెస్టేట్‌ వ్యాపారులను రాకుండా చేయడమే అవుతుంది. ముందుగా అమరావతి మీద అభాండాలు వేయడం ఆపండి. ముందుగా విజయవాడు ప్రజలకు సాదారణ పరిస్దితులు తీసుకురండి. వారిని ఆదుకోండి. కాని వారి జీవితాలతో ఆడుకోకుండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *