జర్నలిస్టులకు న్యాయం చేయండి.
డబుల్ బెడ్ రూములు కేటాయించే వరకు పోరాడుతాం…
రెండో రోజు రిలే నిరహార దీక్షలు. వివిధ పార్టీల నాయకులు, సంఘాల మద్దతు.
జర్నలిస్టుల డబల్ బెడ్ రూమ్ లు కేటాయించండి మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను త్వరగా కేటాయించాలని వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. సోమవారం మొదలైన దీక్ష, పాలకులు స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.. యూనియన్ సంఘాలకు అతీతంగా కూడు గూడు జర్నలిస్టుల హక్కుల కోసం చేస్తున్న నిరాహార దీక్షకు సీపీఐ సిపిఎం నాయకుల మద్దతుతో పాటు, విద్యార్థి సంఘాల సంఘీభావం ప్రకటించారు. ఎవరు కలిసొచ్చినా స్వాగత్తిస్తామని తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు ముక్త కంఠంతో తెలిపారు. మంగళవారం నిర్వహించిన జర్నలిస్టుల నిరాహార దీక్షలో బీజేపీ, సీపీఐ, సీపీఎం, విద్యార్థి సంఘం నేతలు, కార్మిక యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్స్ సాధించే వరకు న్యాయ పోరాటం, నిరసన దీక్షలు చేస్తామని అందులో భాగంగా మూడు రోజుల దీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ న్యాయ పోరాటం జర్నలిస్టుల దీక్షలో తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్యగా పరిగణలోకి తీసుకుంటామని కనీస హక్కుల సాధన పోరాటంలో రాజకీయ రంగు కావాలని అంటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం కలిసోచ్చే పార్టీలకు యూనియన్లకు అతీతంగా స్వాగతిస్తున్నామని అసత్య ప్రచారాలు బురదజల్లే ఆలోచనలు మానుకోవాలని కొందరి నాయకులకు దీక్ష శిభిరం నుండి సూచించారు. మా ప్రయత్నం ఫ్లాట్లు, డబుల్ బెడ్రూమ్స్, కనీస హక్కులు సాధన కోసమేనని అందులో ఎక్కడ పదవులు అధికారం లేదని తేల్చి చెప్పారు.