విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు..
సోషల్ మీడియాను చెడుకు ఉపయోగించొద్దు..
వాట్సాప్, ఇన్ స్టాలో వచ్చే పుకార్లను నమ్మొద్దు..
నిబంధనలకు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు…
యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి..
రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్..
రామాయంపేట ఏప్రిల్ 15 నేటి ధాత్రి (మెదక్)
ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పించేస్తూ ప్రజల మనోభా వాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య లు తీసుకోవడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు.
ఇందుకోసం ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు తప్పుడు వార్తలు పెట్టే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగు తుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు. సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచా రాన్ని రామాయంపేట సర్కిల్ కార్యాలయం కంట్రోల్
రూమ్ వాట్సప్ నెంబర్కు 8712667100 తెలియజేయాలని అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ టెక్నాలజీ యుగంలో వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ద్వారా సమాచారము క్షణాల్లో కొన్నిలక్షల మందికి చేరుతుందని పంపించే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను మంచి మంచి కార్యక్రమాలకు ప్రజలను యువతను చైతన్యపరిచే విధమైన పోస్టులు చేస్తూ మంచితనానికి ఉపయోగిం చుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.