Foundation Laid for Rajiv Gandhi Park
రూ.60 లక్షలతో రాజీవ్‌గాంధీ టౌన్షిప్లో
పార్కు, విగ్రహానికి శంకుస్థాపన*
ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి
హాజరైన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని, దొంతి, కలెక్టర్ సత్యశారద
నర్సంపేట/గీసుగొండ,నేటిధాత్రి:
గీసుగొండ మండలంలోని టెక్స్టైల్ పార్క్ పరిధిలో గల రాజీవ్‌గాంధీ టౌన్షిప్లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిధులు రూ.60 లక్షలతో నిర్మించనున్న రాజీవ్‌గాంధీ విగ్రహం, నూతన పార్కు అభివృద్ధి పనులకు గురువారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కూడా చైర్మన్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు అయ్యూబ్ అలీ, మాజీ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌రావు, కూడా పీవో అజిత్‌రెడ్డి పాల్గొన్నారు. టౌన్షిప్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించేలా పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గీసుగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దాడి శివ, సంగెం మండల అధ్యక్షుడు ఇండ్ల రవి, మాజీ మండల అధ్యక్షుడు తుమ్మలపెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బీమాగాణి సౌజన్య, సమన్వయ కమిటీ సభ్యుడు ఆకుల రుద్రప్రసాద్, సర్పంచ్ గాలి యాకయ్య, ఉప సర్పంచ్ ఊరుగొండ అనిత మురళి, గ్రామ పార్టీ అధ్యక్షుడు జూల రమేష్, మాజీ ఎంపీటీసీ కాగిత బిక్షపతి, పరకాల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేకల అనిల్ యాదవ్,వార్డు సభ్యుడు సుధమళ్ల పవన్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
