# బిఎస్పి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద శ్యామ్
నర్సంపేట, నేటిధాత్రి:
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక యాదవ్ యువతి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వివిధ ఉద్యోగ నియామక ప్రవేశ పరీక్షలు వాయిదా పడడం వల్ల మానసికశోభానికి శుక్రవారం హైదరాబాదులో గురై ఆత్మహత్య చేసుకున్నది. ప్రవళిక మరణానికి కేసీఆర్ ప్రభుత్వం, టిఎస్పిఎస్సి బోర్డు బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ తో కేయూ జేఏసీ విద్యార్థి నాయకులు, ఎస్ఎస్ యు నాయకులు, బీఎస్పీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు వచ్చి నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయడం ఇది ముమ్మాటికి సిగ్గుమాలిన చర్య అని బిఎస్పి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద శ్యామ్ ఆరోపించారు.
ఇకనైనా తెలంగాణ ప్రజలు ఆలోచించి బహుజనుల కోసం ఆలోచించే సమర్థవంతమైన నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎన్నుకోవాలని మంద శ్యామ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నర్సంపేట నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ గుండాల మధన్ కుమార్ ముదిరాజ్ ,వర్ధన్నపేట నియోజకవర్గ కార్యనిర్వాహక ఇన్చార్జి డాక్టర్ వడ్డేపల్లి విజయ్ కుమార్ , వర్దన్నపేట నియోజకవర్గం అధ్యక్షులు చాతల్ల వేణుగోపాల్, వరంగల్ తూర్పు నియోజకవర్గం అద్యక్షులు జన్ను భరత్, ఎస్ఎస్ యు భద్రాద్రి జొన్ అధ్యక్షులు మారపెళ్ళి మనోజ్, జిల్లా నాయకులు గజ్జి దయాకర్, వైనాల కార్తీక్, శ్రీకాంత్ లతో పాటు పలువురు బహుజన నాయకులు పాల్గొన్నారు.