సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్
చేర్యాల నేటిదాత్రి
చేర్యాల పట్టణంలో చేర్యాల టౌన్ చేర్యాల మద్దూరు దుల్మిట్ట కొమురవెల్లి నాలుగు మండలాల సిపిఎం కార్యకర్తల సమావేశంలో సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి మతోన్మాద రాజకీయాలు చాలా ప్రమాదకరమని బిజెపిని ప్రజలు ఓడించాలని అన్నారు పోరాటాలకు ముందుండే సిపిఎం అభ్యర్థి లను గెలిపించాలని భువనగిరి పార్లమెంట్ పరిధిలో పలు ప్రజా పోరాటాలతో నిత్యం ప్రజల తో ఉండే సిపిఎం పార్టీ కి మీ ఓటుతో సమాధానం చెప్పాలని పార్లమెంటులో మాట్లాడే వ్యక్తులు చట్టసభలలో ఉండాలని ఈ ప్రాంతం సిపిఎం కు కంచుకోట అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి నక్క యాదవ రెడ్డి కొంగరి వెంకట్ మావో శెట్టిపల్లి సత్తిరెడ్డి రాళ్ల బండి శశిధర్ రాళ్ల బండి నాగరాజు బండ కింద అరుణ్ ఆముదాల రంజిత్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు