`అవినీతికే తాత రాం చంద్రయ్య!
`రామచంద్రయ్య కథ రామాయణం కన్నా పెద్దది!
`పరువు గాలికొదిలేశావా లంచమయ్య!
`ఉద్యోగం పోయినా బుద్ధి రాలేదేమయ్యా?
`అవినీతి మానుకోలేక పోతువా రామయ్య!
`రిజిస్ట్రేషన్ శాఖలో రాం చంద్రయ్య తిమింగలమే?
`వరంగల్ ఆర్వో కార్యాలయంలో జాయింట్ టు రిజిస్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాడని ‘‘నేటిధాత్రి’’ రాసిన కథనాలకు సస్పెండ్ కు గురైన రామచంద్రయ్య
`ఆ తరువాత ఐదు నెలలకు తిరిగి డీఐజీ కార్యాలయంలో చేరాడు
`డీఐజీ కార్యాలయం నుంచి అవినీతి రామచంద్రయ్య నిజామాబాద్ కి రిజిస్టర్ గా వెళ్లాడు
`నిజామాబాద్ నుంచి ఇటీవల ఆగస్టు మాసంలో జరిగిన బదిలీలలో రామచంద్రయ్య వైరా రిజిస్టర్ గా బాధ్యతలు స్వీకరించాడు
ఉద్యోగంలో చేరి మళ్ళీ మరింత లంచాలకు తెగబడ్డాడు.
సస్పెండైనా సిగ్గు రాలే…లంచాలు మానుకోలే?
డిపార్ట్మెంటల్ ఎంక్వౌరీలో పట్టుబడినా మళ్ళీ కొలువులెలా ఇస్తున్నారు.
అవినీతి అధికారి అని తెలిసినా ఎందుకు ఉపేక్షిస్తున్నారు.
సబ్ రిజిస్టార్లు లంచాలు తీసుకోకుండా పని చేయరా?
అక్రమ రిజిస్ట్రేషన్లు చేయకుండా వుండలేరా?
నిజామాబాద్లో అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు ఎదుర్కోన్నాడు.
వైరాలో అర్థరాత్రి వరకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి వార్తలకెక్కాడు!
హైదరాబాద్,నేటిధాత్రి:
నేరం చేసే వ్యక్తి, తప్పుచేసే వ్యక్తులకు ఆత్మ ప్రబోదం వుండదా? అంటుంది. కాని ఆ సమయంలో రాక్షస ప్రవృత్తి మాత్రమే వారిలో ఎప్పుడూ మేలుకొని వుంటుంది. తప్పు చేయమనే ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వుంటుంది. తప్పుచేసి దొరుతావన్న హెచ్చరికను కూడా వారిలో కమ్మేస్తుంది. అందుకే తప్పు చేసేవాళ్లు తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. కొంత కాలం తర్వాత తప్పులు మాత్రమే చేస్తుంటారు. దొరికినప్పుడు చూసుకుందాంలే అనుకొని తప్పులు చేస్తూనే వుంటారు. ఒక వేళ తప్పు చేస్తుండగా దొరికిన ప్రతి వ్యక్తి మారుతాడని కూడా అనుకోలేం. ఎందుకంటే తాను ఇప్పుడు మారినా ఈ సమాజంలో ఆ పేరు మారుతుందా? అని కొందరు, మారుదామనుకున్నా వారిలో వున్న రాక్షస గుణం మారనవ్విదు. దొరికిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూనే వుంటారు. ఎవరు చీదరించుకున్నా పట్టించుకోరు. ఎవరు ఏమనుకుంటారో అన్న బాధ ఏ కోశాన వుండదు. అసలు వారిలో మంచి తనం అన్నది ఇసుమంతైనా కనిపించదు. అందుకే తప్పు చేసినప్పుడు ఇకపై తప్పు చేయొద్దని అనుకోరు. మళ్లీ తప్పులు చేసిన ప్రతిసారి జాగ్రత్తగాచేయాలనే అనుకుంటారు. ఎలా సంపాదించామన్నది కాదు? ఎంత సంపాదించామన్నదే వారికి లెక్క. అలాంటి లెక్కల్లో మునిగితేలుతూ తప్పుల మీద తప్పులు చేసే ఉద్యోగులు చాలా మంది వున్నారు. అందుకే ఉద్యోగ వ్యవస్ధ ఇంతగా దిగజారిపోయింది. ప్రజలకు నిజమైన సేవ చేయాలనే ఆశయం వున్న వారు ఏ కొందరో గాని, ఇప్పుడున్న సమాజంలో కొన్ని వ్యవస్ధల్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించేవారు లేరు. అలాంటి వ్యవస్ధల్లో రిజిస్ట్రేషన్ల శాఖ. ఆ శాఖలో ఓ ఉద్యోగి నిర్వాకం ఆ శాఖ మొత్తానికి తెలుసు. అయినా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించ లేదు. కారణం ఏమిటో కూడా బహిరంగ రహస్యమే. అందుకే ఈ వార్త. లంచావతారులు పట్టుబడిన సందర్భాల వార్తలు మాత్రమే తెలుసు. లంచాలు ఎవరు ఏ
ఉద్యోగి తీసుకుంటాడో కూడా కొద్దిమందికే తెలుస్తుంది. కాని ఆ ఉద్యోగి ఎవరు? ఎక్కడ ఉద్యోగం మొదలు పెట్టాడు. ఎలా మొదలు పెట్టాడు. ఆ ఉద్యోగంలో ఎందుకు చేరాడు? ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలా పనిచేసి, ఎంత అవినీతి చేశాడన్నది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం వుంది. ఈ వార్తల్లోని ఉద్యోగి రామ చంద్రయ్య. వరంగల్ రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజి కార్యాయలంలో సూపర్డెంట్గా పని చేస్తూన్నారు జీతం తప్ప నాలుగు అదనపు రాళ్లు కనిపించడం లేదు. అదే శాఖలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా సాయంత్రానికి ఎంతో కొంత జేబుల్లో పెట్టుకొని వెళ్తున్నారు. అటు జీతం. ఇటు అదనపంగాలంచం. రెండు చేతుల్లా సంపాదించుకుం టున్నారు. నాకు మాత్రం జీతం రూకలు తప్ప లంచం రాళ్లు కనిపించడం లేదనా రామచంద్రయ్య మధనపడిపోతుండేవారు. అప్పుడు డిఐజిగా ఉన్న ఓ ఉన్నతోద్యోగితో నిత్యం తాను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేయాలని వుందంటూ వేడుకుంటూ వుండేవారు. ఇలా కొంత కాలం విపరీతంగా రామచంద్రయ్య ఆ పై అధికారిని అర్ధిస్తూ వుండడంతో కనికరించి వరంగల్ రూరల్ జాయింట్ 2 రిజిస్ట్రార్ గా డిప్యూటేషన్ మీద పంపించారు. ఇక అక్కడ మొదలైంది రామచంద్రయ్య చేతి వాటం. ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ఆపకుండా సాగుతోంది లంచావతారం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విపరీతంగా రియలెస్టేట్ వ్యాపారం పెరిగింది. గత ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా అందరూ రియల్ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. వరంగల్ నగర పరిధిలోనే ఎక్కడ చూసినా రియల్ వ్యాపారమే. దాంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిత్యం కిటకిటలాడుతుండేది. అటు నాయకులు, ఇటు రియల్ వ్యాపారులతో రామచంద్రయ్యకు బాగా పరిచయాలు పెరిగాయి. నాయకులు చెప్పింది చేసి పెడుతుండడంతో నాయకుల అండదండలు కూడా పుష్కలంగా పెరుగుతూ వచ్చాయి. అవినీతి సంపాదన విపరీతంగా పెరుగుతూ వచ్చింది. రామచంద్రయ్య ఊహించిన దానికన్నా మించి అక్రమ సంపాదన పెరిగింది. నాయకులకులకే పని చేసి పెట్టడంలో వారి సేవల్లో మునిగిపోయాడు. దాంతో నాయకులు కూడా రామచంద్రయ్యను బాగానే చూసుకుంటూ వచ్చేవారు. అయితే రియల్ వ్యాపారంలో అక్రమాలు చోటు చేసుకోవడం మొదలైది.
‘‘సర్కులర్ 257’’ విరుద్దంగా రామచంద్రయ్య రిజిస్ట్రేషన్లు విచ్చలవడిగా సాగిస్తున్నట్లు రామచంద్రయ్యపై రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కార్యాలయానికి సామాన్య ప్రజలనుంచి పిర్యాధులు అందుతాయి. అదే సమయంలో రామచంద్రయ్య సాగిస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను తెలుపుతూ ‘‘నేటిధాత్రి దినపత్రిక కుకూడా వివరాలు అందించారు. ‘‘నేటిధాత్రి’’ వరంగల్ ఆర్వో కార్యాల యంలో రామచంద్రయ్య సాగిస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై కూడా అనేక కథనాలు రాసింది. దాంతో అప్పుడు రిజిస్ట్రేషన్ల
శాఖ ఉన్నతాధికారులు ఎంక్వరీలు మొదలు పెట్టారు. వరంగల్ ఆర్వో కార్యాలయంలో చేపట్టిన ఫైళ్ల తనికీలలో రామచంద్రయ్య పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు దృవీకంరించి రామచంద్రయ్యను సస్పెండ్ చేశారు.అనాడే అవినీతి రామచం ద్రయ్యను సప్పెండ్ చేయించిన ఘనత ‘‘నేటిధాత్రి’’కి దక్కింది.నాలుగు నెలలు తిరిగే సరికి ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకొని రామచంద్రయ్య మళ్లీ కొలువులో చేరాడు. నిజామాబాద్ జిల్లాలో కొలువుదీరాడు. కాని రామచంద్రయ్య వ్యవహారంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. కొలువు పోయిన తర్వాత పిల్లలున్న వాడిని అంటూ ఉన్నతాధికారుల కాళ్లా వేళ్లా పడి, నాయకులతో పైరవీలు చేయించుకొని ఎట్టకేలకు మళ్లీ ఉద్యోగంలో చేరాడు. కాని ఆయన తీరు మార్చుకోలేదు. అవినీతి పరుడుగా ముద్ర పడిరదన్న బాధ ఆయనలో లేకుండాపోయింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించు కుందాం..అంతకు మించి సంపాదించు కుందామనుకున్నట్లున్నాడు. నిజామాబాద్లో మరింత అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు. ప్రభుత్వ హాయంలో అవినీతి పరులకు కొమ్ము కాసే నాయకులు ఎక్కువయ్యారు. అప్పుడున్న పరిస్ధితుల్లో ఆ పార్టీ నాయకులపై నిత్యం రాజకీయం అనేక ఆరోపణలు వస్తూ వుండేవి. కాని రిజిస్ట్రేషన్ శాఖలో అధికారులు చేస్తున్న అవినీతిని పట్టించునే నాధడు లేకుండా పోయాడు. కింది నుంచి పై స్ధాయిదాకా అధికారులు కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అటు ప్రభుత్వం గాని, ఇటు ఉన్నతాధికారులు గాని అవినీతిని లీగల్ చేసినంత సంపాదనకు ఎగబడ్డారు. ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రామచంద్రయ్యనే కాదు, చాల మంది తయారయ్యారు.
ఇంతలో ప్రభుత్వం మారింది. ప్రజా ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన మొదలైంది. కాని అధికారుల్లో మార్పు రావడం లేదు. అధికారుల మీద పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం గమనించిన రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ శాఖ ప్రక్షాళనకు పూనుకున్నారు. గత దశాబ్ధానికి పైగా రిజిస్ట్రేషన్ల శాఖలో ట్రాన్స్ఫర్లు లేకుండా పాతుకుపోయిన వాళ్లతో సహా, రామచంద్రయ్య లాంటి వారికి కూడా స్ధాన చలనం కల్పించారు. అప్పుడు రామచంద్రయ్యను వైరా మండలానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వున్నారు. వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావు వున్నారు. రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వున్నారు. అయినా రామచంద్రయ్యకు భయం లేకుండాపోయింది. అధికారుల్లో కూడా జంకులేకుం డాపోయింది. గతంలో అలవాటు ప్రకారం అక్రమ రిజిస్ట్రే షన్లు మొదలు పెట్టాడు. వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. లేఅవుట్ల క్రమబద్దీకరణ పధకం ఆమోదం పొందని స్ధిరాస్తి ప్లాట్లు ఒకే రోజు 99 రిజిస్టేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అనుమతి లేని లేఅవుట్లలోని స్ధలాల రిజిస్ట్రేషన్లు చేయకుండా ప్రభుత్వం కొన్ని నిబంధలు రూపొందించింది. కాని వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబందనలను అతిక్రమించి, గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. గతంలో వరంగల్లో వున్నప్పుడు కూడా రామచంద్రయ్య ఇలాగే ‘‘257 సర్కులర్’’కు విరుద్దంగా రిజిస్ట్రేషన్లు సాగించిన అనుభవం పుష్కలంగా వుంది. ఇదే వ్యవహారం ఇక్కడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ విషయం మంత్రి పొంగులేటి దృష్టికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరి ఎలాంటి చర్యలుంటాయో వేచి చూడాలి.