భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 14వ వార్డుకు చెందిన మాజి కౌన్సిలర్ మేరాజ్ ఉన్నాసా బేగం , కో ఆప్షన్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్, నాయకులు మోయిన్తో పాటు పలువురు మహిళా నాయకులు తమ సొంత రాజకీయ గూటి అయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో తిరిగి చేరారు.ఈ సందర్భంగా నిర్వహించిన చేరికల కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ దేవీప్రసాద్ రావు , డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువాలు కప్పుకొని అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి ప్రవేశించారు.ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తుతూ ముందుకు సాగుతుండటమే తమ చేరికలకు ప్రధాన కారణమని నాయకులు తెలిపారు. జహీరాబాద్ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను మరింత బలోపేతం చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
