మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ డిసెంబర్ 11
భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై..అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసి..మొట్టమొదటిసారిగా భూపాలపల్లికి విచ్చేసిన గండ్ర సత్యనారాయణ రావు విజయోత్సవ ర్యాలీక భారీ సంఖ్యలో తరలి వెళ్ళిన పర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు గండ్ర సత్యనారాయణ రావుకు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు అలుగువెల్లి రాకేష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని ఇచ్చారని, ఇప్పుడు ప్రజల రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు.
ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలులోకి తెచ్చారని గుర్తు చేశారు. ఇందులో మొదటిది మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు తెచ్చిన పథకం అని వివరించారు. అదేవిధంగా ప్రజలను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిగతా నాలుగు గ్యారంటీలను కూడా త్వరలోనే ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తుందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పర్లపల్లి గ్రామ యూత్ నాయకులు మండ మధుకర్, పుల్యాల కుమార్, మియాపురం రమేష్, పంజా రాజ్ కుమార్, శ్రీనివాస్, మండ కుమారస్వామి, రాకేష్, అజయ్ తదితరులున్నారు.