https://epaper.netidhatri.com/view/323/netidhathri-e-paper-19th-july-2024%09
-గులాబీ రెపరెపలలో వెలిగిన టిఆర్ఎస్.
-ఆనాడు హరీష్ హస్తవాసి కలిసొచ్చింది!
-ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ పనికొస్తుంది.
-హరీష్ మెడలో మెరిసిన టిఆర్ఎస్ పేరు.
-ఒక్కసారిగా నాయకుల్లో కనిపించిన ఉత్సాహం.
-బిఆర్ఎస్ పేరుకు మార్పుకు సంకేతం!
-ఇంతకాలం మార్పు వుండదని చెప్పిన నాయకత్వం.
-ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడికి దృష్టిలో పెట్టుకునే నిర్ణయం.
-స్పందనను పసిగట్టే తొలి ప్రయత్నం.
-కేసిఆర్ ను కలుస్తున్న వాళ్లంతా చెబుతున్నది ఒకటే మాట.
-టిఆర్ఎస్ పేరుతోనే కలిసొచ్చిన రాజకీయ బాట.
-దారి తప్పడం వల్లనే తప్పటడుగు పడిరది.
-అయినా అదే పంతం నిండా ముంచుతుంది.
-కారు దిగే వాళ్లు అదే చెబుతున్నారు.
-కారు దిగిన వాళ్లు అదే అంటున్నారు.
-మేధావులంతా ఒకటే సూచిస్తున్నారు.
-టిఆర్ఎస్లో వున్న ఆత్మ బిఆర్ఎస్ లో లేదని నమ్ముతున్నారు.
-అందుకే ఓడిపోయామని బాహాటంగానే చెబుతున్నారు.
-టిఆర్ఎస్ వరం…బిఆర్ఎస్ శాపం!
-ఇళ్లు పీకి పందిరేసుకున్న వైనం.
-మూర?త్వంతో ముందుకు వెళ్తే ఇంకా మునగడం ఖాయం.
-ఉద్యమ కారులతో నడిస్తేనే కలిసొస్తుంది మలితరం.
-ఉద్యమకారులను పక్కన పెట్టి కోరి తెచ్చుకున్న పరాజయం.
-ఉద్యమానికి సంబంధం లేని వారి ముందు ఎదురైన పరాభవం.
-అరువు నేతలు వచ్చిన నాడే పడిరది ఓటమి భీజం.
-ఎన్నటికైనా ఉద్యమ కారులు దిక్కనుకుంటేనే కారు ప్రయాణం.
-ఇప్పటికైనా మారకపోతే భవిష్యత్తు శూన్యం.
-టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసినప్పుడే మొదలైన సుడి గుండం.
-మార్పు చేసుకోకపోతే మిగిలేది దిన దిన గండం.
-ఇకనైనా మారకపోతే అందరూ కారు దిగిపోవడం ఖాయం.
-అందరూ పోతే మిగిలేది ముగ్గురే అన్నది సత్యం.
-మేలుకుంటే భవిష్యత్తు ఆశా జనకం.
-గీపార్టీ శ్రేణులలో ఉప్పొంగు ఉత్సాహం.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒక్కసారిగా టిఆర్ఎస్ కండువా మాజీ మంత్రి హరీష్‌రావు మెడలో మెరిసింది. రాష్ట్ర ప్రజల దృష్టంతా ఒక్కసారిగా టిఆర్ఎస్ కండువాపై పడిరది. అయితే హరీష్‌రావు మెడలోకి టిఆర్ఎస్ కండువా కాకతాళీయంగా వచ్చిందేమీ కాదు. అనుకోకుండా వేసుకున్నదేమీ కాదు. ప్రజలకు ఒక సంకేతం పంపే దిశలోనే వేసుకున్నట్లు అర్ధమౌతోంది. ఎందుకంటే సంగారెడ్డి పార్టీ కార్యక్రమంలో అందరి మెడల్లో బిఆర్ఎస్ కండువా వుంటే, ఒక్క హరీష్‌రావు మెడలోకే టిఆర్ఎస్ కండువా ఎలా వచ్చింది? అన్నదే అసలు పాయింట్. తొలి ఏకాదశి పండుగ రోజు హరీష్‌రావు మెడలో టిఆర్ఎస్ కండువా మెరవడం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత వుంటుందనేది అందరి అభిప్రాయం. ఎందుకంటే టిఆర్ఎస్ కండువాలు కనుమరుగై రెండేళ్లుకు పైగా అవుతోంది. ఒక వేళ వున్నా అవి ఎక్కడో మూలన వుండి వుంటాయి. వాటి నుంచి ప్రత్యేకంగా తెచ్చుకొని వేసుకుంటే తప్ప టిఆర్ఎస్ కనిపించదు. ఉన్న ఫలంగా టిఆర్ఎస్ కండువా హరీష్‌రావు మెడలో మెరవడం ఒక సంచలనానికి వేధిక కావడమే. హరీష్‌రావు మెడలో మెరిసిన టిఆర్ఎస్ కండువా పాతది కాదు. కొత్తది. అంటే మళ్లీ టిఆర్ఎస్ కండువాలు తయారౌతున్నాయన్న సంకేతం వెలువడినట్లే. కొంత కాలంగా కేసిఆర్ మరీ సైలెంటుగా వుంటున్నాడు. పార్టీ నాయకులతో వచ్చేది మళ్లీ మనమే అంటున్నాడు. మరో వైపు పార్టీని వీడేవారిని వదిలేస్తున్నాడు. అంటే గులాబీకి టిఆర్ఎస్ ఫ్లేవర్ అద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్ధమౌతోంది. త్వరలోనే బిఆర్ఎస్ శ్రేణులందరి మెడలో టిఆర్ఎస్ కండువాలు మెరిస్తాన్నది తేలిపోయింది. ఇటీవల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్, హరీష్‌రావులు కొంత కాలం డిల్లీలో మకాం వేశారు. దాంతో అందరూ రక రకాల చర్చలకు తెరలేపారు. బిజేపిలో విలీన ప్రతిపాదన కోసమే కేటిఆర్, హరీష్‌రావులు మంతానలు జరుగుతున్నారన్న పుకారు పుట్టించారు. కాని కేటిఆర్, హరీష్‌రావులు ఎన్నికల సంఘంతో సమావేశమై, బిఆర్ఎస్ను టిఆర్ఎస్గా మార్చే సాధ్యాసాధ్యాలపై చర్చించారన్నది అర్దమౌతోంది. ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన వచ్చిన తర్వాతే టిఆర్ఎస్ కండువాల తయారీ మొదలైంది. మొదటి కండువా హరీష్‌రావు మెడలో మెరిసింది. అయితే త్వరలోనే ఎన్నికల సంఘం కూడా ఒక ప్రకటన చేసే అవకాశం వుంది. అందుకు ముందస్తుగా హరీష్‌రావు పార్టీ శ్రేణులకు పండుగ రోజును టిఆర్ఎస్ వస్తోందని సంకేతాలు పంపించినట్టైంది.
ఇక ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్గా మారి, ఉద్యమ రూపును సంతరించుకోనున్నదని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి.
అయితే కేసిఆర్ నుంచి ప్రజలు కొన్ని కోరుకుంటున్నారు. కేసిఆర్ ప్రజల్లోకి రావాలన్నది వారి బలమైన కోరిక. ఉద్యమ కాలంలో ఎలా వున్నారో..ఇప్పుడు కూడా అలాంటి కేసిఆర్‌ను చూడాలనుకుంటున్నారు. పదేళ్లుగా ఇదే విషయాన్ని నేటిధాత్రి చెబుతూ వచ్చింది. అనేక కథనాలు కూడా రాసింది. మేధావులు కోరుకున్నారు. ఉద్యమ కారులు కోరుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా ప్రజలతో మమేకమైన తెలుసుకోవాలనుకున్నారు. దానితోపాటు కొంత మంది ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలను కేసిఆర్ తెలుసుకోలేకపోయారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చిన ఎమ్మెల్యేలను కేసిఆర్ వెనకేసుకొచ్చారన్న అపవాదును మోశారు. మరో వైపు తెలంగాణ వాదులను కాదని, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ప్రాదాన్యత పెరగడాన్ని తెలంగాణ సమాజం కూడా ఇష్టపడలేదు. ఇక అమర వీరుల కుటుంబాలను కేసిఆర్ కలిసి ఓదార్చుతారని అనుకున్నారు. కాని ఆ పని చేయలేదు. ఇక ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు కూడా కేసిఆర్ బైటకు రాలేదు. కొండగట్టు లాంటి సంఘటనలు జరిగినప్పుడు కేసిఆర్ ప్రజల్లోకి రాలేదు. దాంతో ఆయనపై అప్పుడే కొంత వ్యతిరేకత మొదలైంది. కాకపోతే 2018 ఎన్నికల్లో అరవైఏండ్ల చెత్త ఐదేండ్లలో పోతుందా? అన్న కేసిఆర్ ప్రచారం బలంగా ప్రజలు నమ్మారు. మరోసారి కేసిఆర్‌ను రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఓ వైపు తెలంగాణలో అభివృద్ది ఆనవాలు కనిపించేలా చేశారు. చెరువులు నింపారు. కాళేశ్వరం కట్టారు. రిజర్వాయర్ల నిర్మాణం చూపారు. తెలంగాణలో కాలువలు తవ్వారు. భూగర్భ జలాలు పెరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించారు. కాని ఆయన ప్రజల్లోకి రాకపోవడం ఒక అసంతృప్తి వెలితిగా మారింది. పైగా అప్పటి కొంత మంది ఎమ్మెల్యేల తీరు కూడా పెద్ద ప్రభావం చూపింది. నేటిదాత్రి కొంత మంది ఎమ్మెల్యేలను మార్చితే బాగుంటుందన్న సూచనలు పలుసార్లు చేసింది. అయినా కేసిఆర్ చెవిన పెట్టలేదు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఉచ్చులో పడ్డారు. దమ్ముంటే అదే ఎమ్మెల్యేలను అభ్యర్ధులుగా ప్రకటించాలన్న డిమాండ్‌కు కేసిఆర్ సై అన్నాడు. రేవంత్‌రెడ్డి రెచ్చగొడుతున్నాడని ఎంత మంది చెప్పినా వినిపించుకోలేదు. ఓ వైపు నిరుద్యోగులు ఎంతో ఆగ్రహంగా వున్నారు. డబుల్ బెడ్ రూం సమస్యలు, రేషన్ కార్డులు, ధరణి ఇబ్బందులతోపాటు, అధికారుల అవినీతి తీవ్ర స్ధాయికి చేరుకున్నది. కాని కేసిఆర్ పట్టించుకోలేదు. అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. దాంతో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అటు ఎమ్మెల్యేల సంపాదనలు, ఇటు అధికారులు చేతి వాటాలతో ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. ఎన్నికలైన వెంటనే ప్రజలు మా ఎమ్మెల్యేల ఓడిపోతారనుకున్నాము..కాని కేసిఆర్ ఓడిపోతాడని అనుకోలేదంటూ ప్రజలందరూ చెప్పుకొచ్చారు. ఈ విషయం నేటిధాత్రి అనేకసార్లు చెప్పడం జరిగింది. కాని కేసిఆర్ పెడ చెవిన పెట్టారు. కోరి కోరి నష్టం తెచ్చుకున్నారు. కాని ప్రజల గుండెల్లో ఇంకా కేసిఆర్ వున్నారు. అందుకే కేసిఆర్ ప్రజల్లోకి వస్తే ఆ లెక్క వేరే వుంటుంది. టిఆర్ఎస్ కండువాతో వస్తే ఆ ఊపు మరో ఉద్యమంలా వుంటుంది.
మళ్లీ పూర్వపు వాసనలు అద్ది, గులాబీ కండువాలో టిఆర్ఎస్తో కొత్త శోభను తెచ్చే తరుణం ఆసన్నమైంది.
తెలంగాణలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే టిఆర్ఎస్ ఇక ఉద్యమ పార్టీ కాదు. ఫక్తు రాజకీయ పార్టీ ప్రకటించిన కేసిఆర్ ఉద్యమ కారులను దూరం పెట్టారన్న అపవాదును మోస్తూ వచ్చారు. కాకపోతే అది నిజం కాదు. వారిలో చాలా మందికి సముచిత స్ధానం కల్పించారు. కాని కొంత మందికి పదేళ్లలో అవకాశాలు రాలేదు. అసలైన ఉద్యమకారులను దూరం పెట్టాడు. తన తాబేదారులను మాత్రమే దగ్గర పెట్టుకున్నాడన్న అపవాదును మోశారు. పైగా కొంత మంది ఉద్యమకారులకు వారికి ఊరించి, ఊరించి అదికారంలో వున్నంత కాలం ఏ పదవులు ఇవ్వకుండా కాలయాపన చేశాడని కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. తెలంగాణ ద్రోహులను తెచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. అసలు తెలంగాణ వాదాన్నే తప్పు పట్టినవారికి ప్రాదాన్యతనిచ్చాడు. తెలంగాణ వాదులను తరిమి కొట్టిన వారిని అక్కున చేర్చుకున్నాడు. ఉద్యమ కాలంలో కేసిఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి దుమ్మొత్తి పోసిన వారికి పదవులు పంచాడు. ఇది పార్టీ నాయకులు కూడా అనేక సార్లు చెప్పిన మాటే. కాని కేసిఆర్ ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం అప్పుడు ఫలితాలిచ్చింది. రాజకీయ పార్టీ అన్న తర్వాత ప్రతిసారి గెలవాలన్న రూలేం లేదు. కాని బిఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. కేసిఆర్‌పై నమ్మకం ప్రజలకు సడలలేదు. తెలంగాణను కేసిఆర్ వదిలి, జాతీయ రాజకీయాలకు వెళ్లడం తెలంగాణ ప్రజలకు ఇష్టం లేదు. ఆయన సేవలు తెలంగాణకే పరిమితం కావాలన్నది తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్ష. ఎందుకంటే తెలంగాణకు కేసిఆర్లాగా ఎవరూ న్యాయం చేయలేరు. తెలంగాణ ప్రగతిపై కేసిఆర్ ఆలోచించినంత ఎవరూ ఆలోచించలేరు. ఏ పార్టీలో తెలంగాణ వాదం కోసం పనిచేసిన నాయకులు పెద్దగా లేరు. జాతీయ పార్టీలో వున్న నాయకులు వారి అధిష్టానం ఆదేశాల మేరకే పనిచేయాలి. కాని పదే పదే నాకు తెలంగాణ ప్రజలే అదిష్టానం అంటూ చెప్పిన కేసిఆర్ జాతీయ రాజకీయాలు ఎంచుకోవడం తెలంగాణ ప్రజలకు సుతారం నచ్చలేదు. పైగా తెలంగాణ ద్రోహులకు కేసిఆర్ పెద్ద పీట వేయడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఆనాడు కేసిఆర్ ఆదరించకపోతే తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితం ఏనాడో పరిసమాప్తమయ్యేది. కాని దాన్ని చిగురింపజేసింది కేసిఆర్. తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ వాది కాదు. ఉద్యమకారుడు అసలే కాదు. తెలంగాణ ఆకాంక్షను ఏనాడు వెలుబుచ్చిన సందర్భం లేదు. అలాంటి నాయకుడిని తెచ్చి పెట్టుకొని ప్రాధాన్యతనిస్తే ఆయన దూరమయ్యారు.
తెలంగాణ ఉద్యమకారులను లాఠీతో తరిమిన దానం నాగేందర్ లాంటి వారిని ఆనాడు ఆదరించకపోతే ఆయన రాజీకయ జీవితం ఎప్పుడో కనుమరుగయ్యేది.
అలాంటి వారి రాజకీయ జీవితం ఇంకా కొనసాగేందుకు పురిగొల్పింది కేసిఆరే అనేది బిఆర్ఎస్ నేతల అభిప్రాయం. ఇక వైసిపిని నుంచి గెలిచిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ కోసం వాడుకొని, ఆయన రాజకీయ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తే, ఖమ్మంలో బిఆర్ఎస్ను అసెంబ్లీ గేటు తాకుండా చూస్తానని శపథం చేశాడు. అన్నంత పనిచేశారు. బిఆర్ఎస్ను ఖమ్మంలో కారు కోలుకోకుండా చేశారు. నిజానికి ఎంతో మంది ఉద్యమకారులు అప్పటికే మంచి నాయకులుగా ఖమ్మంలో ఎదిగిన వారున్నారు. వారందరికీ ప్రాదాన్యతనిస్తే, వారిని గుర్తించి పదవులు పంచితే, సమర్ధులైన వారికి అవకాశాలు కల్పిస్తే గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయేదే కాదు. పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పువ్యాడ అజయ్ కుమార్‌ను తెచ్చుకుంటే ఖమ్మంలో ఒక్క సీటు కూడా రాకుండా పోయింది. ఆయన ఒంటెద్దు పోకడలే పార్టీని నిండా ముంచాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పార్టీకి దూరం కావడంలో అజయ్ పాత్రే పెద్దది. వరంగల్ జిల్లాలో రాజయ్య మీద పితూరిలు చెప్పిన వారిని నమ్మి, ఆయనను పక్కన పెడితే ఏమైంది? బిఆర్ఎస్కు కంచు కోటలాంటి వరంగల్‌లో ఆ పార్టీ తరుపున మాట్లాడేందుకు నాయకుడు లేకుండా పోయింది. వరంగల్ లో పార్టీ పునాదులే కదిలిపోయాయి. రాజయ్యను పక్కన పెట్టి కడియం శ్రీహరి లాంటి వారికి ఎనలేని ప్రాదాన్యతనిస్తే ఏమైంది. ఇప్పటికైనా కేసిఆర్ తెలుసుకోవాల్సింది ఒకటే. ఉద్యమ కారులకు ఇప్పటికైనా తగిన ప్రాధాన్యత కల్పిలంచాలి. పార్టీని బలోపేతం చేయాలి. అందుకు సంస్ధాగత నిర్మాణం జరగాలి. తన వద్దకు ప్రజలను, నాయకులను పిలిపించుకోవడం కాదు. ప్రజల వద్దకు వెళ్లాలి. కనీసం వారంలో రెండు రోజులైనా ప్రజలను కలిసేందుకు జిల్లాల పర్యటనలు పెట్టుకోవాలి. ఎన్నికలు లేవని, ఇప్పుడు ప్రజలకు వద్దకు వెళ్లి చేసేదేముందనుకొని, ముసుగు తన్నుకొని పడుకుంటా అంటే పార్టీ పని అయిపోయినట్లే. ఒక్కసారి చంద్రబాబు రాజకీయాన్ని చూసైనా నేర్చుకోవాలి. 2004 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఆయన ప్రజల్లోకి వెళ్లారు. కాని 2009లో ఓడిపోయారు. అయినా ఆయన ఇంటికి పరిమితం కాలేదు. ఇంతలో వచ్చిన తెలంగాణ ప్రకటనతో సమైక్య రాగం అందుకున్నారు. జనంలోకి వెళ్లేందుకు అవకాశం వచ్చింది. 2014లో గెలిచారు. నిత్యం ప్రజలతోనే వున్నారు. రాజధాని నిర్మాణం కోసం కష్టపడ్డారు. 2019లో మళ్లీ ఓడిపోయారు. అయినా ఆ వయసులోనూ ఆయన నిర్భందాలను ఎదుర్కొన్నారు. జైలు జీవితం అనుభవించారు. అటు ఆయన కుమారుడు లోకేష్‌తో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మరో వైపు చంద్రబాబు జనంలోనే వున్నారు. 2004లో మళ్లీ తిరుగులేని విజయం సాదించారు. అదీ నాయకుడికి వుండాల్సిన లక్షణం. అంతే కాని జనం ముందుకు రాను..అనుకుంటే ఇక నేను రాను అని చెప్పి రాజకీయాలు వదులుకో..ఎందుకంటే పార్టీ కోసం ఇప్పటికే సర్వం కోల్పోయిన వాళ్లు కొన్ని లక్షల మంది నాయకులున్నారు. వారంతా ఇంకా చితికిపోతారు. లేకుంటే ఎవరి వారి దారి చూసుకొనైనా బాగుపడతారు.