
గుండాల,ఆళ్లపల్లి,కొమరారం, బోడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీసు అధికారులు నిత్యం వారికి అందుబాటులో ఉండాలి ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఇల్లందు సబ్ డివిజన్లోని ఏజెన్సీ పోలీస్ స్టేషన్లయిన గుండాల,ఆళ్లపల్లి,కొమరారం మరియు బోడు పోలీస్ స్టేషన్లను సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని…