నర్సంపేట,నేటిధాత్రి:
రాజకీయాలకతీతంగా నిజమైన లబ్ధిదారులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఎంసిపిఐ [యు] నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా ప్రభుత్వం తలపెట్టిన గ్రామసభ ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా నర్సంపేట మండలం , మాదన్నపేట గ్రామంలో అధికారులకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి సంబంధం లేకుండా,భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలన్నారు .అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షలు రూపాయలు ఏ మూలకు సరిపోవని ,ఇల్లు కట్టించే బాధ్యత మొత్తం ప్రభుత్వమే తీసుకోవాలని కనీసం 15 లక్షలకు ఈ మొత్తాన్ని పెంచాలన్నారు .రేషన్ కార్డులు లేని వారందరికీ వెంటనే మంజూరు చేయాలన్నారు .అనర్హులకు కాకుండా నిజమైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కేశెట్టి సదానందం, అనుమాల రమేష్ ,కేశెట్టి శ్రీనివాస్ ,గుర్రం రవి ,కర్నె సాంబయ్య పాల్గొన్నారు.