నేటిధాత్రి కథనానికి స్పందన
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని సమస్యపై మురికి కాలువలను శుభ్రం చేయండి అనే వార్త కథనం శుక్రవారం నేటిధాత్రి పత్రికలో ప్రచురితమైంది. ఈకథనానికి స్పందించి గ్రామప్రత్యేక అధికారి, ఎంపిడివో రాజేశ్వరి, గ్రామ కార్యదర్శి, పారిశుద్ధసిబ్బందితో కలిసి మురికి కాలువలను శుభ్రపరిచారు. ఈసందర్భంగా కాలనీ వాసులు తమ సమస్య పరిష్కరించేందుకు కృషిచేసిన పాత్రికేయులకు దన్యవాదములు తెలియజేశారు.