నేషనల్ గర్ల్ చైల్డ్ డే-2025
హనుమకొండ లోని ప్రముఖ వాగ్దేవి విద్యాసంస్థల వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసి కళాశాల నందు మైండ్ బాడీ మెడిసిన్ ప్రాక్టీస్ అనే కార్యశాల లో భాగంగా 24-01-2025 నాడు డాక్టర్ భరత్ రాజ్ జైన్ -చెన్నై, డాక్టర్ శుభ వర్షిని – మంగళూరు మరియు డాక్టర్ ఎం.పేరరసు కన్నన్- చెన్నై నుండి విచ్చేసి విద్యార్థులకు కార్యశాలను నిర్వహించినారు. ఈ కార్యశాలకు వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బి ఫార్మసీ మరియు ఫార్మాడీ విద్యార్థులతో పాటు జయముఖి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసియుటికల్ సైన్సెస్- బొల్లికుంట విద్యార్థులు, తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు కార్యశాలలో పాల్గొని ఆల్టర్నేట్ మెడిసిన్ లోని ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్రీనివాస్ రెడ్డి, ఫార్మా డీ హెచ్.ఓ. డి. డాక్టర్ బి.ఎస్.శరవణభవ, ఫార్మకాలజి హెచ్.ఓ.డి డాక్టర్ ఈ. వెంకటేశ్వర్లు, హెచ్.ఓ.డీ. డాక్టర్ వై.శ్రవణ్ కుమార్, హెచ్. ఓ. డి. డాక్టర్ డి కుమార్ స్వామి, డాక్టర్ ఎస్ పావని, డాక్టర్ పి. గిరిజ, డాక్టర్ ఎం మాధవి, డాక్టర్ లక్ష్మీ కళ్యాణి, కే. రాగిణి, ఎం.సుమలత, ఎం. శృతి, డాక్టర్ సఫియా నసీర్, డాక్టర్ జి లావణ్య, డాక్టర్ వి. స్నేహప్రియ, జయముకి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫార్మా డి హెచ్ ఓ డి డాక్టర్ నిషాత్ ఫాతిమా, డాక్టర్ సుమంత్ రాజ్ VIPS మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
అలాగే ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే పురస్కరించుకొని డాక్టర్ నిషాత్ ఫాతిమా మరియు డాక్టర్ శుభ వర్షిని విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించినారు. ఆడపిల్లలు తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యవహరించాల్సిన తీరు, ఎంటర్ప్రైన్యుర్షిప్ మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలంటే చేయాల్సిన పనులను తెలిపినారు.
ఈ కార్యశాలను ఉత్సాహంగా, ఇంత ఘనంగా నిర్వహించినందుకు గాను కే. హరిచంద్ర ప్రసాద్ మరియు ఫార్మసీ విద్యార్థులను, ప్రిన్సిపల్ డాక్టర్ కే.శ్రీనివాస్ రెడ్డిని, హెచ్.ఓ.డి. డాక్టర్ బి.ఎస్ శరవణభవను మరియు ఫార్మకాలజీ హెచ్.ఓ.డి. డాక్టర్ ఈ. వెంకటేశ్వర్లును కళాశాల సెక్రటరీ కం కరస్పాండెంట్ డాక్టర్ సిహెచ్ దేవేందర్ రెడ్డి గారు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ వాహినీ దేవి గారు అభినందించారు.