కాంగ్రెస్ నాయకులు అతితో సభలో గంధరగోళం
కాంగ్రెస్ కార్యకర్తలనే సంక్షేమ పధకాలకు ఎంపిక చేస్తున్నారు
లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని స్థానికుల నిరసన
నేటిధాత్రి ఐనవోలు /హన్మకొండ :-
అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ గందరగోళానికి దారితీసింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో మా ఇష్టరీతిన ఎంపిక చేస్తాము అని స్పెషల్ ఆఫీసర్ కి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏకపక్ష సూచనలు చేయడం రసాబాసకి దారితీసింది. ఐనవోలు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మాదాసు ప్రణయ్ కాంగ్రెస్ నాయకుల ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన లబ్ధిదారులకు రావడంలేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఎంపిక అంతా రానున్న స్థానిక ఎన్నికల జిమ్మిక్కులు అని ప్రణయ్ విమర్శించారు .ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే హామీలు అమలు చేయాలని ఆయన కోరారు.