దావోస్ వేదికగా రేవంత్ ప్రభుత్వం సాధించిన మరో విజయం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులకోసం చంద్రబాబు చర్చలు
వివిధ సంస్థల ప్రతినిధులు, సి.ఇ.ఒ.లతో ఎడతెరిపిలేని చర్చలు
కృత్రిమమేధకు చంద్రబాబు ప్రాధాన్యం
ఒకే వేదికపై గురుశిష్యులు
ఈసారి దావోస్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి తెలుగు రాష్ట్రాల పరంగా ఒక ప్రత్యేకత వుంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరుకావడం తమ రాష్ట్రాలు పెట్టుబడులకోసం ప్రయత్నించడం ఒక ఎత్త యితే ఇద్దరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో గురుశిష్యులుగా ప్రసిద్ధులైన సంగతి అందరి కీ తెలిసిందే. తర్వాత క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం వరుసగా జరిగిన పరిణామాలు. ఇప్పుడు విచిత్రంగా గురుశిష్యులిద్దరూ తమ రాష్ట్రాలు పెట్టుబడులకోసం యత్నించడం ఒక విచిత్ర పరిస్థితిని సృష్టించిందనే చెప్పాలి.
ఈ ఏడాది రెండోసారి దావోస్‌లో మూడురోజుల పర్యటన ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐ.టి.శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు ఇతర అధికార్లు రాష్ట్రానికి రూ. 1,78,950 కోట్ల పెట్టుబడుల విజయవంతంగా సమీకరించగలిగారు. గత ఏడాది దావోస్ సమావేశంలో సాధించిన పెట్టుబడులకంటే ఇవి మూడిరతలు అధికం కావడం గమనార్హం. 2024లో జరిగిన దావోస్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో రేవంత్ పరంగా చూస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆయన పాల్గన్నారు. ఈ సమావేశానికి ఆయన తన ప్రతినిధులతో సహా వెళ్లి రూ.40,232వేల కోట్ల మేర పెట్టుబడులను సాధించగలిగారు. ఇప్పుడు దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐ.టి.పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సారథ్యంలో వివిధ పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యమివ్వడంఅందరినీ ఎంతగానో ఆకట్టు కుంది. దీంతో పాటు యంగ్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ, రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్ ప్రణాళికలు పెట్టుబడులు పెద్దఎత్తున రావడానికి దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్`2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా వున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా సాధించిన పెట్టుబడులు ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాయి. దేశ విదేశాలకు చెందిన పేరొందని పది ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యంగా ఐ.టి, ఇంధన రంగాల్లో ఆశించినదానికంటే పెద్దమొత్తం లో పెట్టుబడులు సమకూరాయి. దావోస్‌లో వరుసగా మూడు రోజులపాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రూ. 1,78,950 కోట్లు పె ట్టుబడులతో పాటు రాష్ట్రంలో 46వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నా యి. ఈ ఏడాది ఆయన లక్షకోట్ల పెట్టుబడులు సాధించాలన్నది ఆయన లక్ష్యంతో దావోస్ వెళ్లారు. అనుకున్నదానికంటే అధికంగానే సాధించారు. ఆయన పెట్టుబడిదార్లతో వాణిజ్య దిగ్గజాలతో జరిపిన చర్చలు ఎట్టకేలకు సానుకూల ఫలితాలనిచ్చాయి. ఇప్పటికే హైదరాబాద్ ఒక స్థాయికి ఎదగడం వల్ల, పెట్టుబడులు పెట్టడానికి ఎవరికీ పెద్దగా అభ్యంతరం వుండబోదన్న సత్యం మరోసారి రుజువైంది. ఇప్పటికే ఇక్కడ ఎన్నో బహుళజాతి సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండటం మరో సానుకూలాంశం. అనుకున్నదానికంటే అధికంగా అద్భుత ఫలితం సాధించడంతో రేవంత్‌రెడ్డిలో ఎంతో ఉత్సాహం కనిపించింది. రికార్డు బద్దలు కొట్టే స్థాయిలో సాధించిన ఈ పెట్టుబడులు, ప్రపంచ వేదికపై పెరుగుతున్న తెలంగాణ పలుకుబడికి చిహ్నమన్నారు. ఈ పెట్టుబడులు తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు ఎంతగానో దోహదపడతాయని ఐ.టి.పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
చంద్రబాబు ప్రయత్నాలు
ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే 1999`2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014`19 మధ్యకాలంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తు తం ఆయన తనయుడు లోకేష్ ఐ.టి. మంత్రి హోదాలో ఈ సమావేశంలో పాల్గంటున్నారు. 2019`24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో దావోస్ సమావేశంలో పాల్గన డానికి పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. దీనికి ప్రధాన కారణం కోవిడ్ మహమ్మారి అని చెప్పవచ్చు. దీని కారణంగా ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశం అప్పట్లో రెండుసార్లకే పరిమితమైం ది. వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి 2022లో తన ప్రతినిధి బృందంతో ఈ సమావేశానికి హాజరై రూ.1.25లక్షల కోట్ల మేర అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అప్పటి ప్రభుత్వం వెల్లడిరచింది. తర్వాతి కాలంలో జగన్ ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోవడంతో ఆయన ఈ సమావేశానికి హాజరుకావడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు. కాగా 2025లో చంద్రబాబు నాయుడు రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ సమావేశాల్లో పాల్గంటున్నారు. మంచి అనుభవశాలి అయిన చంద్రబాబు ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు తీసు కొస్తారన్న ఆశలున్నాయి.
వచ్చే ఐదేళ్లకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 49500 ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీన్ని సాధించే క్రమంలో లోకేష్ నేతృత్వంలో తీవ్రంగా కృషి జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం 15 పాలసీలను అమల్లోకి తెచ్చింది. పారిశ్రామికాభివృద్ధి విధా నం, ఎలక్ట్రానిక్ విధానం వంటివి ఇందులో భాగం. వీటిద్వారా పెట్టుబడులను ఆకర్షించడా నికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తొలిరోజు చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం భారత రాయబారిని కలుసుకున్న అనంతరం హిల్టన్ హోటల్‌లో పది మంది పారిశ్రామిక వేత్తలతో, హయత్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా’’ కార్యక్రమంలో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతేకాకుండా ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు.ఈ సంస్థ అనకాపల్లిలో ఉక్కుపరిశ్రమను నెలకొల్పనున్నది. రెండోరోజు ఆ యన గ్రీన్ హైడ్రోజన్‌కు సంబంధించిన సదస్సులో పాల్గని, కోకాకోలా, ఎల్‌జీ, సిస్కో తదితర కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. ఆయన యుఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్ తో సమావేశమై ‘‘ఎనర్జీ ట్రాన్సిషన్’’, ‘‘ది బ్లూ ఎకానమీ’’ అంశాలపై చర్చలు జరిపారు. మూడోరోజు కూడా చంద్రబాబు సమావేశాలు, సదస్సులు, చర్చలతో తీరుబడి లేకుండా గడిపారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు యూనిలివర్, డి.పి. వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెహ్రాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనికా సంస్థల ప్రతినిధులతో చర్చించారు. రెండోరోజు చంద్రబాబు టీమ్ గ్రీన్ కోతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో హిరిత ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. గూగుల్ క్లౌడ్ సి.ఇ.ఒ. థామస్ కురియన్‌తో జరిపిన చర్చల్లో విశాఖపట్టణంలో డిజైన్ సెంటర్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. ప్రస్తుతం గూగుల్ క్లౌడ్‌కు ముంబయి, ఢల్లీిల్లో రెండు క్లౌడ్ రీజియన్స్ వున్నా యి. ఇటీవలనే గూగుల్ క్లౌడ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చు కుంది. దీని ప్రకారం విశాఖపట్టణంలో ‘డేటా సిటీ’ ఏర్పాటు, కృత్రిమ మేథ అప్లికేషన్లను మరింత ఆధునికీకకరించడం వంటివి చేపడతారు. అదేవిధంగా పెట్రనాస్ సి.ఇ.ఒ. మహమ్మద్ తౌఫిక్‌తో కూడా చర్చలు జరిపారు. ఇది మలేసియాకు చెందిన చమురు`సహజవాయువు కంపెనీ. ప్రస్తుతం ఈ కంపెనీ కాకినాడలో రూ.13వేల నుంచి రూ.15వేల కోట్లతో హైడ్రో జన్ మరియు అమోనియా ప్లాంట్‌ను నెలకొల్పాలని యోచిస్తోంది. పెట్రనాస్ కంపెనీ తన పెట్టుబడులను మూలపేటకు విస్తరించాలని, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని పెట్రోకెమికల్ హబ్ గా రూపుదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక పెప్సికో కంపెనీ సీఈవోతో జరిపిన చర్చల్లో రాష్ట్రంలో కుర్‌కురే ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈవిధంగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకొని రావడానికి మంచి కృషే చేశారు. గతంలో ఐటీ రంగానికి ఇచ్చినట్టే ఈసారి కృత్రిమమేధకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు.
మొత్తంమీద చెప్పాలంటే పెట్టుబడులను ఆకర్షించడమంటే గట్టి పోటీని ఎదుర్కోకత తప్పదు. పెట్టుబడులు పెట్టేవారు అన్ని సానుకూలతలు ఆలోచిస్తారు కనుక రాష్ట్రాలు తాము కల్పిస్తు న్న సదుపాయాలను వాటికి వివరించే ప్రయత్నం చేస్తాయి. తమ సానుకూలతను బట్టి సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తాయి. ఎక్కడైనా జరిగేదిదే!