భద్రాద్రి కొత్తగూడెంలో విమానయాన బృందం పర్యటన శుభపరిణామం

విమానాశ్రయం ఏర్పాటుకు గరీబీపేట ప్రాంతం అనుకూలం

రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రేత్యేక ద్రుష్టి సారించాలి

విమానాశ్రయం అధ్యయన బృందంతో భేటీఐన ఎమ్మెల్యే కూనంనేని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు పౌర విమానయాన ప్రతినిధులు కొత్తగూడెంలో పర్యటించడం శుభ పరిణామని, బృందం పర్యటనతో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లేనని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. గరీబ్ పేట ప్రాంతాల్లో అధ్యయన బృందంతో గురువారం భేటీ ఐన కూనంనేని ఇక్కడి పరిస్థితులను, విమానాశ్రయం ఏర్పాటు ఆవశ్యకతను బృందానికి వివరించారు. అనంతరం అయన మాట్లాడుతూ రామవరం-గరీబ్ పేట ప్రాంతంలో ఉన్న స్థలాన్ని బృందం పరిశీలించింది, సానుకూలమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. స్థల సేకరణపై ఎలాంటి వివాదాలు ఉండబోవని, ఈ ప్రాంత ప్రజలు విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న కొత్తగూడెంకు విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, సమీపంలోని రాష్ట్రాలకు కూడా కొత్తగూడెం విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని తెలిపారు. విమానాశ్రయం ఏర్పాటుతో కొత్తగూడెం ప్రాంతమే కాకుండా, భద్రాద్రి జిల్లా సమగ్రంగా అభివృద్ధి సాదిస్తుందని తెలిపారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, చైర్పర్సన్ సీతాలక్ష్మి, కమిషనర్ శేషాంజన్ స్వామి, కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, ధర్మరాజు, సత్యనారాయణాచారి, మాచర్ల శ్రీనివాస్, యూసుఫ్, ఫహీమ్, పిడుగు శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, గుత్తుల శ్రీనివాస్ తదితరులు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!