RTC Rally Promotes Road Safety
ఆర్టీసీ నర్సంపేట డిపో ఆధ్వర్యంలో ‘అర్రైవ్-అలైవ్’ ర్యాలీ
అంబేద్కర్ జయంతి సందర్భంగా మహిళా స్వీపర్లకు చీరల పంపిణీ
నర్సంపేట, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) నర్సంపేట డిపో ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా “అర్రైవ్–అలైవ్” నినాదంతో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ నాయకత్వంలో నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డుపై ఈ ర్యాలీ జరిగింది.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్సై అరుణ్, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.అనంతరం డిపోలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ నర్సంపేట డిపో ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిపోలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మహిళా స్వీపర్లకు చీరలను పంపిణీ చేసి కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో డిపో అధికారులు, సూపర్వైజర్లు, మెకానిక్లు, కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వీరరెడ్డి ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
