Paddy Procurement Centers Launched in Metpally
మెట్పల్లి మండలంలోని పలు గ్రామాలలో వరి ధన్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ తహసిల్దార్
మెట్ పల్లి ఏప్రిల్ 24 నేటి ధాత్రి
మెట్ పల్లి మండలం లోని ఆత్మకూరు,ఆత్మనగర్, ఏ ఎస్ ఆర్ తండా, మెట్ల చిట్టాపూర్ , మేడిపల్లి సతక్కపల్లి గ్రామాలలో ఐకెపి వరి ధాన్యంకొనుగోలు కేంద్రాలను ఏఎంసి చైర్మన్ కూన గోవర్ధన్, తహశీల్దార్ నీతా మేడం ప్రారంభించారు. చైర్మన్ మాట్లాడుతూ ధాన్యాన్ని చక్కగాఅరబెట్టుకొని అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని,సెంటర్ నిర్వాకులు నిబందనల ప్రకరం కొనుగోళ్లు చేయాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలో పై గ్రామాల సర్పంచులు రాజారాం,విజయ,సురేందర్, అరుణ,రాజేష్,మహేందర్ రెడ్డి ఉపసర్పంచులు, గ్రామాల రైతులు, గ్రామసంఘాల లీడర్లు, ఏఎంసి డైరెక్టర్ లింగారెడ్డి ఆర్ ఐ ఉమేష్, సీసీ లు సూరయ్య, అశోక్, సురేఖ, వెంకటరమణ,జీపీవో లు, గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, ఏ ఇ ఓ భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
