ambedkar vigrahanni punaprathishitinchali, అంబేద్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి

అంబేద్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని పంజాగుట్ట సెంటర్‌లో పున:ప్రతిష్టించాలని, లేకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్‌కుమార్‌ తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చడం, ఎస్సీ, ఎస్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని, ప్రభుత్వం వెంటనే అంబేద్కర్‌ విగ్రహన్ని పున:ప్రతిష్టించాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను ఏకం కావాలని, ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎండి.నయిం, జాతీయ నాయకులు చిన్నపెల్లి శ్రీనివాస్‌, వస్కుల ఉదయ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు ఫమిజుల్లా, బిసి సెల్‌ సెక్రటరీ లెనిన్‌, తూర్పు ఇన్‌చార్జ్‌ ప్రసన్నకుమార్‌, క్రాంతి, జిల్లా డైరెక్టర్‌ వజిద్‌ అలీ, జిల్లా నాయకులు ఎండి.సుబాని, రాష్ట్ర నాయకులు రాబర్ట్‌ విల్సన్‌, రవీందర్‌, జెసి రవీందర్‌, సయిద్‌, అంబాల మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *