RSS Celebrates Ambedkar Jayanti in Mancherial
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
మంచిర్యాల,నేటి ధాత్రి:
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సహప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ పాల్గొని, డా. బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని సూచించారు.రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ,అందులో భాగమైన పౌరులుగా మనం పాటించవలసిన కర్తవ్యాలను తప్పనిసరిగా అనుసరించాలని ఆయన తెలిపారు.దేశాన్ని ఒక నాగరిక సమాజంగా రూపుదిద్దడంలో ప్రతి పౌరుడు ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహ కృష్ణ భాస్కర్, సహకార్యవాహ శ్రీనివాస్,జిల్లా ప్రచారక్ నాగరాజు,రామకృష్ణ, రాజేశ్వర్ ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
