Ambedkar Jayanti Celebrated at Gram Panchayat
గ్రామ పంచాయతీ కార్యాలయం లో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు.
కోదాడ, నేటి ధాత్రి:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను మంగళవారం కోదాడ మండలం తొగర్రాయి గ్రామ గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ లిక్కీ గురవమ్మ వెంకటయ్య, ఉపసర్పంచ్ ఉమామహేశ్వరి శీను లు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనదేశంలో పుట్టడం మన అందరి అదృష్టం అన్నారు. ప్రపంచంలోని మహనీయుల జాబితాలో అగ్రగణన్యుడుగా అంబేద్కర్ ఉన్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా సమ సమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాలకు అతీతంగా మహనీయులను స్మరించుకోవాలని అది మనందరి బాధ్యతనీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అవినాష్, వార్డ్ నెంబర్ పులి సంధ్య, నాగమ్మ వీరయ్య , నరేష్, దేవాలయం కమిటీ చైర్ పర్సన్ సరస్వతి మదన్ మోహన్, ఎస్సి సెల్ అధ్యక్షులు పులి సులోచన రావు, వెంకయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, ఆదం నాగరాజు, ఏడుకొండలు, సునీత, గ్రామపంచాయతీ సిబ్బంది యువకులు మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
