బాలానగర్ /నేటి ధాత్రి.
బాలానగర్ మండలం బోడ జానంపేట గ్రామ నివాసి, అంబేద్కర్ సంఘం మహిళ ఉపాధ్యక్షురాలు బి.శ్రీలత గురువారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ అధ్యక్షుడు పొట్లపల్లి యాదయ్య, రఫిక్, శంకర్ నాయక్, వెంకట్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.