Donations Used Only for Temple Development
విరాళాలన్నీ ఆలయ అభివృద్ధికే: ఆలయ ధర్మకర్త
శంకర్పల్లి,నేటిధాత్రి :
దాతలు, భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి మరకత శివాలయం అభివృద్ధికే వినియోగిస్తున్నామని ఆలయ ధర్మకర్త వెంకటేశ్వరరావు తెలిపారు. దేవాదాయ శాఖకు పూర్తి లెక్కలు సమర్పిస్తామని చెప్పారు. ఇటీవల శాఖ అధికారులు ఐదేళ్ల లెక్కలు కోరగా, మూడు నెలల గడువు కోరినట్లు వెల్లడించారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రం, వసతి గదులు నిర్మించామని, వాటి ఆదాయాన్ని కూడా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు దేవేందర్ రెడ్డి, సాగర్, సుధీర్ గౌడ్, లీలావతి, విట్టలయ్య, అనంతయ్య, వెంకటస్వామి, నవీన్, అర్చకులు సాయి శివ ప్రసాద్, వీరేష్ ఉన్నారు.
