ఓపి,అనస్తిషియా ఫీజుల పెంపు వెనక్కి తీసుకోవాలి
ఆర్డీవో ఆఫీసు వద్ద ఎంసిపిఐ(యు) ఆందోళన
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా ఆసుపత్రులను నిర్వహిస్తూ ప్రజలను దోచుకుంటున్న వైద్యులపై చట్టరీత్య చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు. ఓపి అనస్థీషియా ఫీజుల పెంపు ఆలోచనలను ఐఎంఏ విరమించుకోవాలని కోరారు.బుదవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య) నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వైద్యం పేరుతో నిబంధనలు విరుద్ధంగా దోచుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట ఆర్టీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి కార్యాలయ అధికారికి మెమోరాంఢం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల అనారోగ్యాలను ఆసరా చేసుకుని వైద్యం పేరుతో నిబంధనలు పాటించకుండా ఆసుపత్రులకు వచ్చే పేద మధ్యతరగతి రోగులకు ఓపి టెస్టులు ఐపి ఆపరేషన్ అంటూ వేలాది రూపాయలను మానవత్వం ప్రదర్శించకుండా దోచుకుంటున్నారని అవసరం లేకున్నా అదిక కమిషన్ వచ్చే మందులను రాస్తున్నారని ఈ క్రమంలో డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకొని సేవా దృక్పథాన్ని మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకి మెడికల్ డ్రగ్ మాఫియా పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపంలా తయారైందని అనారోగ్యం బారిన పడితే ఆస్తులన్నీ అమ్మి అప్పుల పాలై దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఇవేమీ చాలవు అన్నట్లు ఐఎంఏ ఆధ్వర్యంలో ఓపి అనస్థీషియా ఫీజులు పెంచడం అన్నారు. ఇప్పటికైనా అలాంటి ఆలోచన విరమించుకొని ప్రభుత్వా నిబంధనల ప్రకారం ప్రజలకు వైద్యాన్ని అందించి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోరారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీ నిర్వహించి నిబంధనలను పాటించని ఆసుపత్రులపై వైద్యులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు ఎండి. మాషుక్, నాయకులు బెజ్జంకి అచల, గణిపాక బిందు, గడ్డం నిర్మల, జన్ను నీల, తిరుపల్లి లక్ష్మి, పల్లెపు. ఐలమ్మ. తదితరులు పాల్గొన్నారు.