అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు చేసిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం గుంపుల భారత్ పెట్రోలియం బంక్ పక్కనగల రైస్ మిల్లు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ చేసి హైదరాబాద్ కు తరలించడానికి లోడ్ చేస్తుండగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కంటైనర్ లారీని మరియు లోడర్ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ నిల్వ చేసిన దాదాపు 20 ట్రాక్టర్ల ఇసుక గూర్చి ఓదెల తాసిల్దార్ కు సమాచారం ఇవ్వడం జరిగిందని నేరస్తులైన పెద్దిరెడ్డి జనార్దన్ రెడ్డి, మణిదీప్, పొన్నగంటి సురేష్, కోర్రి భాస్కర్, రాజన్ కుమార్ లు ఉనుకమరియు ఇసుక ను కలిపి కంటైనర్ లో తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఇసుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిలువచేసి హైదరాబాదుకు తరలించడానికి సిద్దం చేస్తున్న నేరస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిలువ చేసిన, తరలించిన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోబడును అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.