SP
సీనియర్ సిటిజన్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో 2007 తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2011 లోని ముఖ్య అంశములను సెక్షన్ల వారిగా తెలుగు భాషలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అనువదించిన వాల్ పోస్టర్లను జిల్లా ఎస్పీ, మహేష్.బి.గితే ఐ.పి.ఎస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ చట్టం ప్రకారం సామాన్యులకు కూడా చట్టంలోని అంశములు తెలిసి ఫిర్యాదు చేయుటకు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుంది అని తెలిపారు. మరియు ఎస్పీ అనుమతితో ఆఫీసు ముందర పోస్టర్ను అతికించడం జరిగినది. అత్యధికంగా ప్రజలు తిరిగే ఆర్డిఓ. కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది. సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి అనుమతితో అక్కడ కూడా వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంఘ సభ్యులు, దొంత దేవదాసు, సహాయ కార్యదర్శులు , అంకారపు జ్ఞానోబా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
