ముప్పిరెడ్డిపల్లి లో విజయవంతమైన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం…
300 మందికి పైగా రోగులకు పరీక్షలు….
రామయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, వి ఎస్ టి ఇండస్ట్రీస్ తూప్రాన్ వారి సహకారంతో… మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోనీ గ్రామ పంచాయతీ భవనంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఉచిత ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. తూప్రాన్ వి ఎస్ టి సీనియర్ మేనేజర్ కిషోర్ కుమార్, కంపెనీ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపికృష్ణ ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులతో కలిసి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం తాము రెడ్ క్రాస్ సంస్థతో కలిసి కంపెనీ పరంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామనీ వారు తెలియజేశారు..

గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.. రెడ్ క్రాస్ సంస్థ
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య శిబిరంలను నిర్వహిస్తూ పేదలకు సేవలు అందించడం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్య బృందం గ్రామానికి చేరుకొని ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించింది.. అంతేకాకుండా రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య బృందంలో ఐశ్వర్యా రెడ్డి, రోనిత్ రెడ్డి, డాక్టర్ తేజస్వారి, కే అమూల్య రెడ్డి, శ్రేయ సింగ్,రమాదేవి, షాదిన్ మహాదీన్, లిఖిత, సుమానియాతో పాటు పనులు డాక్టర్లు ఉన్నారు.
ఈ వైద్య పరీక్షల్లో సుమారు 300 వందల మందికి పైగా రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దంత పరీక్షలు, నరాలకు సంబంధించిన కీళ్ల నొప్పులు, దగ్గు ,దమ్ము రోగులను డాక్టర్ల బృందం పరిశీలించిoది..
ఈ కార్యక్రమం లో మనోహరాబాద్ ఎంపీడీవో కృష్ణమూర్తి,మెదక్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సభ్యులు సింగం శ్రీనివాసరావు, కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్,
కోశాధికారి డి.జి.శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పి.దామోదర్ రావు,దేమేయాదగిరి, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, వంగరి కైలాసం,సభ్యులు తోట శ్రీనివాస్ గుప్తా,వి. సతీష్ రావు తో పాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.