చిల్పూర్ జనగామ నేటి ధాత్రి: స్టేషన్గన్పూర్ నియోజకవర్గ
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి విజయం కోసం ఆయన కూతుర్లు కడియం కావ్య, నవ్య, రమ్యలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో గురువారం మార్కెట్ డైరెక్టర్, బూత్ కన్వీనర్ బత్తుల రాజన్ బాబు ఆధ్వర్యంలో 109 బూతు ప్రచారంలో కడియం కావ్య, దివ్య డాక్టర్ నజీర్ ఇంటింటి బొట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా వారు కెసిఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలను వివరించుకుంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తాళ్ల పెళ్లి సంపత్ కుమార్,తాళ్లపల్లి క్రాంతి కుమార్, వేమునూరు శ్రీనివాస్,తాళ్లపల్లి స్వామి,కొత్తపెళ్లి యాకరాజు, తాళ్లపల్లి జగన్నాథం, రామడుగు సమ్మయ్య,గుంటి మల్లయ్య
మాచర్ల రాకేష్,మాచర్ల రంజిత్, తాళ్ల పెళ్లి గంగరాజు, ఈర్ల రూపేష్, రామ్ నారాయణ,తాళ్ల పెళ్లి రమ్య, బత్తుల రాణి, వేమునూరు మాధురి, కొత్తపెళ్లి సుమలత,తాళ్లపల్లి సుమలత,రమ,ఇందిరతోపాటు
పెద్దసంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.