Headlines

వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..!

కేసీఆర్ పథకాలు తెలంగాణకు గ్యారంటీ..

కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు తప్పవు..

# ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాధవరెడ్డి ఎక్కడికి పోయాడు..


# ప్రజల కోసమే పని చేస్తున్నా… ప్రజా సేవకునిగా ఉంటా..!

# 19 వా రోజు జోరుగా దుగ్గొండి మండలంలో పెద్ది ఎన్నికల ప్రచారం..

# వానను సైతం లెక్కచేయని గులాభి శ్రేణులు..

# అడుగడుగునా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతాలు.

# బతుకమ్మలు, బోనాలు మంగళహారతులతో మహిళల నీరాజనాలు..

# గులాభిమయమైన దుగ్గొండి మండలం


# నర్సంపేట బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి :

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే.ఇప్పుడు జరుగబోయే ఎన్నికల్లో మరల వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని నర్సంపేట బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తేల్చిచెప్పారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా 19 వ రోజు దుగ్గొండి మండలంలో మూడవ విడత ప్రచారం ముగిసింది.దుగ్గొండి మండలంలోని కేశవపురం గ్రామంలో మొదలైన ప్రచారం లక్ష్మిపురం,బందంపల్లి,దేశాయిపల్లి, గుడి మహేశ్వరం, జాఫర్ పల్లి,తొగరురామయ్యపల్లి గ్రామాల వరకు కొనసాగుతూ స్వామిరావుపల్లి, మైసంపల్లి కాలనీ,మైసంపల్లి గ్రామాల మీదుగా గోపాలపురం,గొల్లపల్లి నుండి రాత్రి వరకు దుగ్గొండి మండల కేంద్రానికి ప్రచార రథం చేరుకున్నది.కాగా ఎన్నికల ప్రచారంలో
కార్యకర్తలు,నాయకులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.గ్రామ గ్రామాన బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో మహిళలు నీరాజనాలు పలికారు.లక్ష్మీపురం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పెద్ది పూల మాలలు వేసి నివాళులర్పించారు.మహిళల కోలాటాలు,డప్పుల ప్రదర్శన ఎంతగానో అలరించాయి.దేశాయిపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పెద్దికి ఆ గ్రామానికి చెందిన పలువురు రైతులు ఎడ్ల బండ్లతో మద్దతు తెలుపుతూ స్వాగతం పలికారు.ఈసందర్భంగా భారీ వర్షం పడగా ఆ వర్షాన్ని సైతం లెక్కచేయని గులాబీ శ్రేణులు ఆయా గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను తెచ్చి అమలు చేశారని తెలుపుతూ ఇప్పటి ఎన్నికల మేనిఫెస్టోలో పొందపరిచిన పథకాలకు, తెలంగాణకు గ్యారంటీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.నియోజకవర్గంలో గోదావరి జలాలతో సాగునీటి సమస్యలు తీర్చమని రోడ్ల వ్యవస్థ గ్రామ గ్రామాన అంతర్గత ఏర్పాటు,గ్రామానికి గ్రామానికి బీటీ లింక్ రోడ్ల నిర్మాణాలు,మండలాల నుండి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణాలు ఏర్పాటు చేశానని ఎమ్మెల్యే తెలిపారు.నిత్యం ప్రజల కోసమే పనిచేస్తూ స్థానికంగానే ఉంటూ ప్రజలకు సేవకుడిగా పని చేస్తున్నానని చెప్పారు.ఇప్పటివరకు అభివృద్ధి చేసిన పనులు 60 శాతం పూర్తికాగా మరికొన్ని పనులు పలు దశల్లో ఉన్నాయని వాటికి పూర్తి చేయాలంటే నేను ఉంటేనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే పెద్ది ప్రజలకు వివరించారు.సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తికి నేను. నాకు ఆస్థులు పాస్థులు లేవు,వెనక ముందు ఎవరు లేరు నాకు మీరే దిక్కు.మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తానని బిఅర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు.కరోనా సమయంలో ప్రజలు,అకాల వర్షాలకు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవరెడ్డి ఎక్కడికి పోయాడని ప్రశ్నించారు. టూరిష్టుగా నియోజకవర్గానికి వచ్చిపోయే దొంతి మాధవరెడ్డి ఓటు వేయాలో నిత్యం మీతోనే ఉండే నాకు ఓటు వేయాలో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది ప్రజలకు సూచించారు.గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంట్ కష్టాలు ఎనలేనివని, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంతో 24 గంటల ఉచిత విద్యుత్ తో కష్టాలు తీరాయని మరల కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ కరెంట్ కష్టాలు తప్పవని ఆయా గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు.ఈ ప్రచార కార్యక్రమాలలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి,ఎంపిపి కాట్ల కోమల భద్రయ్య,మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్ రావు,ఎన్నారై సెల్ అధికార ప్రతినిధి,యూత్ విభాగం నియోజకవర్గం కన్వీనర్ శానాబోయిన రాజ్ కుమార్,అర్ఎస్ఎస్ మండల కన్వీనర్ తోకల నర్సింహరెడ్డి,మండల పార్టీ ఉపాధ్యక్షులు బూర హేమచంద్ గౌడ్,కామిషెట్టి ప్రశాంత్,డివిజన్ నాయకులు వంగేటీ అశోక్ కుమార్, శంకేషి కమలాకర్,క్లస్టర్ బాధ్యులు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి,ఎంపిటిసిలు మొత్తాల రాజు,సుమన్,అరుణ,
మెరుగు రాబాబు,సొసైటీ చైర్మన్లు ఊరటి మైపాల్ రెడ్డి,బొమ్మాగాని రవీందర్ గౌడ్,సర్పంచ్ లు పాండవుల సురేష్, తోకల మంజుల నర్సింహరెడ్డి,నీలం పైడయ్య,పాశం రవి,వనమాల,నాయకులు తోటకూరి రాజు,కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి,నాయకులు,ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *