*ఎన్ టి ఏ ను రద్దు చేయాలి.*
*విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు.*
*ఎస్ఎఫ్ఐ మొయినాబాద్ మండల కార్యదర్శి చరణ్ గౌడ్*
నేటిధాత్రి, చేవెళ్ల :
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ, అవినీతి పరీక్షల నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ )ను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ మొయినాబాద్ మండల కార్యదర్శి చరణ్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యానికి గురిచేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థులకు న్యాయం చేయాలని, విశ్వసనీయమైన ప్రజాస్వామ్య పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
