నేటి నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు
– సిరిసిల్లలో మాట్లాడుతున్న క్రికెట్ క్రీడాకారులు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేటి నుంచి 12 జూన్ 2026 వరకు జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్-14,16,19,23 బాలురు, బాలికల ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని క్రికెట్ అసోసియేషన్ ఇంచార్జ్ వంకాయల కార్తీక్ పేర్కొన్నారు. సిరిసిల్లలో మంగళవారం విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలోనే బాల బాలికల ప్రతిభను గుర్తించి క్రికెట్ నైపుణ్యం సాధించే విధంగా ప్రత్యేక ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల సిరిసిల్ల గోదావరిఖని కరీంనగర్ లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డు వైట్ డ్రెస్ తో తమ పేర్లను నమోదు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు.
