Grand Felicitation to Advocate Nateshwar
హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాది నటేశ్వర్‌కు ఘన సన్మానం
శ్రీరాంపూర్ : నేటి దాత్రి
నటేశ్వర్ కు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఘన సన్మానం జరిగింది. రాష్ట్రీయ హిందూ పరిషత్ లీగల్ అడ్వైజర్‌గా సేవలందిస్తున్న నటేశ్వర్ను కోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళా న్యాయవాదులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సన్మానించి అభినందించారు.సామాజిక సేవలో భాగంగా 50 సార్లు రక్తదానం, 29 సార్లు ప్లేట్లెట్స్ దానం చేయడం, గోసంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, యోగ మాస్టర్, మానసిక-శారీరక కోచ్ గా సేవలందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు కొనియాడారు.భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నటేశ్వర్ మాట్లాడుతూ.. అందరి ప్రేమాభిమానాలు జీవితాంతం మరువలేనివని, ఇలాగే ఆశీస్సులు అందించాలని కోరారు
