CCTV Cameras Installed in Village
సర్పంచ్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం…ఎస్సై క్రాంతి కిరణ్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా గ్రామ సర్పంచ్ ఎర్పుల సునిత కుమరస్వామి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఈ సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమంలో ఎస్సై క్రాంతి కిరణ్ సర్పంచ్ ఎర్పుల సునీత కుమారస్వామి , గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లోఆరు కెమెరాలు అమర్చినట్లు వాటి విలువ సుమారు 85000/-నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతి కిరణ్ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కూడా ఇవి ఉపయోగపడతాయి. గ్రామాభివృద్ధికి సర్పంచ్ తీసుకున్న ఈ చర్య అభినందనీయం. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి అని పిలుపునిచ్చారు.
గ్రామస్తులు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. 24 గంటల నిఘాతో గ్రామంలో భద్రత పెరుగుతుందని, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కుండే బాల కుమార్ మంద ప్రవీణ్ గ్రామ పెద్దలు సంకు శ్రీనివాస్ రెడ్డి ఎసల్ల సత్యనారాయణ, సుధ గాని విజేందర్,మంచాల కుమారస్వామి, కారోబార్ కంచ కట్టయ్య,ఏర్పుల కృష్ణ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
