Blood Donors Honoured
రక్తదాతలను ఘనంగా సన్మానించిన శంకర్ గౌడ్
వనపర్తి నేటీదాత్రి .
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదాతలను వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలస శంకర్ గౌడ్
వనపర్తి రెడ్‌క్రాస్ కార్యాలయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ
రెడ్‌క్రాస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన, స్వచ్ఛంద మానవతావాద సంస్థ అన్నారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించడం, వారికి సహాయం చేయడం రక్త దాన సంస్థ ఉద్దేశం అని అన్నారు ఈకార్యక్రమంలో
గంధం నాగరాజు డా బండారు శ్రీనివాస్ మురళి వసీం అక్రమ్
గోవిందు శ్రీమతి లక్ష్మి నర్స్ సంతోష్ కుమార్ తిరుపతయ్య పాల్గొన్నారని శంకర్ గౌడ్ ఒక ప్రకటన లో తెలిపారు
