BC Rights Protest Sparks Row
హక్కుల కోసం ప్రశ్నిస్తే పదవులు తీసేస్తారా…?
బీసీలకు 42శాతం రిజర్వేషన్ మాటల్లో మాత్రమేనా…?
బీసీ హక్కుల కోసం గొంతెత్తినందుకే నాపై రాజ్యాంగ విరుద్ధ సస్పెన్షన్ — పెరుమాండ్ల చరణ్ గౌడ్
కేసముద్రం/ నేటి దాత్రి
మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం 2011 నుండి నిరంతరం పోరాడుతున్న ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంతియుతంగా డిమాండ్ చేసినందుకు నాపై భారత యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి నుండి ఎటువంటి కారణాలు చూపకుండా, వివరణ కోరకుండా, అంతర్గత విచారణ నిర్వహించకుండా సస్పెన్షన్ విధించడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని రాజ్యాంగ విరుద్ధం అని పెరుమాండ్ల చరణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, బీసీ యువతకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గౌరవం ఇస్తామని ప్రకటించారని. కానీ నేడు వాస్తవ పరిస్థితుల్లో మాత్రం బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీ యువతకు అవకాశాలు దక్కడం లేదని. పార్టీ కోసం కష్టపడిన అనుబంధ సంఘాల కార్యకర్తలను పక్కన పెట్టి, చివరి నిమిషంలో వచ్చిన వారికి పదవులు ఇవ్వడం బాధాకరం అని అన్నారు.
నేను 2011 నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కోసం ఎన్నో పోరాటాలు చేశానని. ఎన్ఎస్యూఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారని. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలపై హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నా అని. పార్టీ కోసం లాఠీ దెబ్బలు, కేసులు ఎదుర్కొన్నానని , కానీ కాంగ్రెస్ సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోలేదు అని గుర్తుచేశారు.మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంపై నేను చేసిన నిరసన పూర్తిగా శాంతియుతం, ప్రజాస్వామ్యబద్ధమైనది. బీసీ సమాజానికి న్యాయం చేయాలని, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేశారు. కానీ దానికి ప్రతిఫలంగా నాపై సస్పెన్షన్ విధించడం బీసీ సమాజాన్ని అణచివేయడమే అని మండిపడ్డారు. ఈ ఘటన ఒక వ్యక్తిపై జరిగిన అన్యాయం మాత్రమే కాదని. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ అని చెప్పే నాయకత్వం వాస్తవానికి బీసీ యువత గొంతును ఎంతవరకు అణచివేస్తుందో చూపించే ఉదాహరణ. బీసీ హక్కుల కోసం ప్రశ్నిస్తే పదవులు తీసేస్తారా? పార్టీ కోసం 15 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలకు ఇదేనా గౌరవం అనే ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలలో, ముఖ్యంగా బీసీ యువతలో తీవ్రంగా వినిపిస్తున్నాయని అన్నారు. అందువల్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వెంటనే ఈ విషయంపై జోక్యం చేసుకుని, బీసీ సమాజానికి న్యాయం చేయడంతో పాటు తన పై విధించిన సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని వినమ్రంగా విజ్ఞప్తి చేశారు.బీసీలకు న్యాయం జరిగే వరకు, కాంగ్రెస్ సిద్ధాంతాలను కాపాడే కార్యకర్తలకు గౌరవం దక్కే వరకు నా పోరాటం కొనసాగుతుంది అని ఎన్ ఎస్ యు ఐ మాజీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల చరణ్ గౌడ్ స్పష్టం చేశారు.
